Begin typing your search above and press return to search.
కొత్త రచ్చ: సాగర్ గోడలకు గులాబీ రంగు
By: Tupaki Desk | 30 Jun 2017 7:31 AM GMTవిభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నరచ్చలు సరిపోనట్లు సరికొత్త వివాదానికి తెర లేచింది. తాజా ఇష్యూలో మాత్రం తెలంగాణరాష్ట్రానిదే తప్పంతా అన్న మాట వినిపిస్తోంది. ఇద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు వీలైనంత వరకూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కానీ.. తాజా ఉదంతంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే నీటి విడుదలకు సంబంధించి పలుమార్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన సంగతి తెలిసిందే. సాగర్ లోని నీటి కేటాయింపులు.. నీటి విడుదలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు చాలానే ఉన్నాయి. ఇవి సరిపోవన్నట్లుగా తాజాగా సాగర్ ఆధునికీకరణ పేరుతో ప్రాజెక్టు గోడలకు గులాబీ రంగు వేస్తుండటంతో ఆంధ్రా ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు నిర్వహణపైన ఇప్పటికే పలు వివాదాలుఉన్నాయి. ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఈ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టు ఆధునికీకరణ పేరుతో రంగులు మారుస్తూ ప్రాజెక్టును గులాబీమయం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఏదో ఒక సాకును చూపించి ఆంధ్రా ప్రాంత నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజకీయం చేస్తున్నారని తెలంగాణ అధికారపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవ అంతా ఎందుకు.. విభజన నాటికి ప్రాజెక్టు గోడలకు ఏ రంగు ఉందో.. దాన్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది కదా? అన్న సూచన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/