Begin typing your search above and press return to search.

పార్కింగ్ లోనూ మహిళలకు వాటా!

By:  Tupaki Desk   |   9 Feb 2019 8:27 AM GMT
పార్కింగ్ లోనూ మహిళలకు వాటా!
X
అవునండీ మీరు వింటున్నది నిజమేనండీ.. పార్కింగ్ లో మహిళలకు వాటానా అంటూ ఇక ఆశ్చర్యపోనవరసరం లేదు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రత్యేకం సీట్లు - మెట్రో ట్రైన్లలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కోచ్ లను చూశాం. వీటి మాదిరిగానే ఇక ముందు మల్టిప్లెక్స్ ఏరియాకు చెందిన పార్కింగ్ స్థలాల్లో మహిళలకు ప్రత్యేకంగా కొంత స్థలాన్ని ‘పింక్ పార్కింగ్’ పేరిట కేటాయించనున్నారు.

ఇక అసలు విషయానికొస్తే చెన్నైలో కొత్తగా ప్రారంభమైన ఈవీసీ కార్నివాల్ సినిమాస్ మల్టీప్లెక్స్ యాజమాన్యం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆకట్టుకునేందుకు ‘పింక్ పార్కింగ్’ పేరిట మల్టిపెక్స్ పార్కింగ్ స్థలంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. అంటే వారికి పార్కింగ్ స్థలంలో కొంత ఏరియాను కేటాయించారు. మహిళలకు ఇప్పటివరకు ఎవరూ కూడా ఇలా పార్కింగ్ కోసం స్థలం కేటాయించలేదు. దేశంలోనే తొలిసారిగా మహిళలు వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా పార్కింగ్ స్థలంలో కొంత ఏరియాను కేటాయించడంపై హర్షం వ్యక్తం అవుతోంది.

ఈ ఐడియా సక్సస్ అయితే మిగతా మల్టిపెక్స్ యజమానులు కూడా ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఏదిఏమైనా వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఈవీసీ కార్నివాల్ సినిమాస్ మల్టీపెక్స్ తీసుకున్న నిర్ణయం మేలు చేస్తుందనడం సందేహం లేదు. ఇదేవిధంగా అన్ని మల్లిపెక్స్ యజమానులు పింక్ పార్కింగ్ చర్యలు తీసుకోకుంటే కొంతమేరకు మహిళలకు ఇబ్బందులు తొలుగుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రానురానూ థియేటర్ల టికెట్ల విషయంలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తారేమో అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. అది కూడా జరిగిన ఆశర్చపోనవసరం లేదని పలువురు అంటున్నారు. చూద్దాం మున్మందు ఏం జరుగుతుందో..