Begin typing your search above and press return to search.
జీవీకే కుంభకోణం...ఎఫ్ ఐఆర్ లో పింకి రెడ్డి పేరు?
By: Tupaki Desk | 3 July 2020 4:30 PM GMTముంబై ఎయిర్ పోర్టులో జరిగిన నిధుల అవకతవకల వ్యవహారంలో జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జి.వెంకట కృష్ణారెడ్డి, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ కంపెనీ (ఎంఐఏఎల్) పై , ఎంఐఏఎల్ ఎండీగా ఉన్న జీవీ సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల వ్యవధిలో వీరంతా కలిసి రూ. 705 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, జీవీకే గ్రూప్ కంపెనీ ప్రతినిధుల నేరపూరిత చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఏఐ తీవ్రంగా నష్టపోయిందని సీబీఐ ఆరోపించింది. ఎంఐఏఎల్ లో జీవీకేకు 50.5 శాతం, ఏఏఐకి 26 శాతం వాటాలు వున్నాయని, ఎంఐఏఎల్ వద్ద ఉన్న రూ. 395 కోట్ల అదనపు మూలధనాన్ని 2012 నుంచి 2018 మధ్య జీవీకే అనుబంధ కంపెనీల్లోకి తరలించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జీవీకే కుంభకోణంలో నమోదైన ఎఫ్ ఐ ఆర్ లో ఆర్బిట్ ట్రావెల్స్ సంస్థకు డైరెక్టర్ గా పింకిరెడ్డి (గునుపాటి అపర్ణా రెడ్డి) పేరును చేర్చింది సీబీఐ. జీవీకే కుంభకోణంలో ఆర్బిట్ ట్రావెల్స్ సంస్థ తో పాటు మరో 8 సంస్థల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది.
ముంబై ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పేరుతో ఏఏఐ నిధులు మళ్ళించారని జీవీకే సంస్థకు చెందిన జీవీ కృష్ణారెడ్డి, సంజయ్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త టీ. సుబ్బరామిరెడ్డి కుమార్తె, సోషలైట్ అయిన పింకి రెడ్డి పేరును కూడా సీబీఐ అధికారులు చార్జి షీట్ లో చేర్చారు. రూ.705 కోట్ల కుంభకోణంలో పింకిరెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు సీబీఐ గుర్తించినట్టుగా తెలుస్తోంది. పింకిరెడ్డి, శ్రేయ భూపాల్, శాలిని భూపాల్ డైరెక్టర్లుగా ఉన్న ఆర్బిట్ ట్రావెల్స్ సంస్థతోపాటు జీవీకేకు చెందిన 8 సంస్థలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. జీవీకే గ్రూప్ ఉద్యోగులకు సంబంధించిన ఫ్లయిట్ టికెట్ల బుకింగ్, ట్రావెల్స్, హోటళ్ల బుకింకగ్ కోసం ఆర్బిట్ ట్రావెల్స్ తో జీవీకే ఒప్పందం చేసుకొందని సీబీఐ గుర్తు చేసింది. అయితే, వీరికి ఎంఐఏఎల్ తో ఎటువంటి సంబంధం లేదని, అయినప్పటికీ ఆర్బిట్ ట్రావెల్స్ కు ముంబై ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ నిధులను చెల్లించినట్టుగా సీబీఐ దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది. అందుకే, ఆర్బిట్ ట్రావెల్స్ , పింకీ రెడ్డి పేర్లను ఎఫ్ ఐఆర్ లో చేర్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ప్రముఖ సోషలైట్ గా ఉంటూ...భారీ స్థాయిలో పేజ్ 3 పార్టీలు ఇచ్చే పింకీరెడ్డి పేరు ఈ వ్యవహారంలో రావడం చర్చనీయాంశమైంది.