Begin typing your search above and press return to search.
శ్రీదేవి దుబాయ్ వెళ్లకముందు ఇదే జరిగింది
By: Tupaki Desk | 28 Feb 2018 7:33 AM GMTప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి అంత్యక్రియల కోసం హాన్స్ శ్మశాన వాటికను సిద్ధం చేస్తున్నారు. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించుకునేందుకు ఇండస్ట్రీని నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాని ఎంపీ సుబ్బిరామి రెడ్డి కూతురు పింకి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి కుటుంబంతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. 15ఏళ్ల క్రితం తాము ముంబైకి వెళ్లినట్లు అప్పటి నుంచి శ్రీదేవికి - తనకు మంచి అటాచ్ మెంట్ ఉందని తెలిపారు. శ్రీదేవి ఎప్పుడు తన ఇంటికి వచ్చినప్పుడల్లా చేపల పులుసు - బొమ్మిడాయిల పులుసు బాగా ఇష్టం తినేదని చెప్పారు.
అంత రిలేషన్ ఉన్న తాను శ్రీదేవి మరించిందన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. దుబాయ్ కి వెళ్లకముందు శ్రీదేవి గొంతు నొప్పి - జర్వంతో బాధపడుతున్నట్లు తనకు కాల్ చేసినట్లు తెలిపారు.దుబాయ్ వెళ్లిన శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోయారంటే నమ్మలేదని - ఆ విషయంపై తొలత తన భర్త కేశవ్ తో మాట్లాడారాని చెప్పారు. శ్రీదేవి మరణంపై తాను అనీల్ కపూర్ భార్యకు ఫోన్ చేసి శ్రీదేవి మరణించిందనే విషయంపై మాట్లాడినట్లు తెలిపారు. ఆ తర్వాత బోనీకపూర్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారని - ఆయన ఏడుస్తూనే ఉన్నారు' అని పింకిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బోనీ - శ్రీదేవి జంట ఒకరంటే మరొకరికి ప్రాణమని - ఇద్దరు పిల్లలు వారి ప్రాణమని అన్నారు.
శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి తన ప్లేస్ రీప్లేస్ చేస్తుందని - అందుకు పడ్డ కష్టం అంతా ఇంతా కాదని గుర్తు చేశారు. శశాంక్ డైరక్షన్ లో వస్తున్న దడక్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు, అలాంటి సమయంలో శ్రీదేవి మరణం బాధాకరమని అన్నారు.
ఓ వైపు శ్రీదేవి బాత్ టబ్ లో పడి మరణించారనే ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పినా మీడియా మాత్రం తప్పుడు కథనాల్ని ప్రసారం చేయడం తనని ఎంతగానో బాధించాయని చెప్పారు.