Begin typing your search above and press return to search.
అమరావతికి వెళితే ఏమీ కనిపించదు
By: Tupaki Desk | 17 March 2018 6:27 AM GMTమోడీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుదాడి మొదలైంది. కేంద్రమంత్రులు రంగంలోకి దిగారు. ఒక్కొక్కరుగా చంద్రబాబు తీరుపై విమర్శలు చేయటం షురూ చేశారు. కేంద్రం తమను ఆదుకోవటం లేదని.. నిధులు ఇవ్వటం లేదని.. విభజన హామీల్ని నెరవేర్చటం లేదన్న విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టటం వెనుక వాస్తవం కంటే సెంటిమెంట్ ఎక్కువగా ఉందని విమర్శించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.
తాజాగా ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్న ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు మినహా మరే ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం వెల్లడించిందన్న ఆయన.. బాబు సర్కారుకు నిధుల పరంగా సాయం చేసినా అవేమీ అమలు కావటం లేదన్నారు.
ఏపీ రాజధాని అమరావతికి తాము ఇప్పటివరకూ రూ.2500 కోట్లు ఇచ్చామని.. కానీ అక్కడేమీ జరగలేదన్నారు. నిధులు అడిగే చంద్రబాబు వాటిని ఖర్చు పెట్టే విషయంలో మాత్రం వెనుకబడ్డారన్నారు. ఇప్పుడు అమరావతికి మనం వెళితే అక్కడేమీ కనిపించదన్న ఆయన.. ఇంతకాలం మామూలుగా ఉండి హటాత్తుగా విమర్శలు చేస్తున్నారన్నారు.
తాము ఏపీకి అన్ని రకాల ఫండ్స్ ఇచ్చామన్నారు. నిధులు అడిగే చంద్రబాబు.. వాటితో అభివృద్ధి పనులు చేయటంలో మాత్రం విఫలమవుతున్నారన్నారు. చంద్రబాబు డ్రామా యుద్ధం అంటుంటారని.. తాము చట్టబద్ధమైన హామీలు అన్నింటికి కట్టుబడి ఉన్నట్లుగా పీయూష్ స్పష్టం చేశారు. మొత్తంగా బాబు తీరును తప్పు పట్టటంతో పాటు.. ఆయన మాటలన్నీ తప్పేనన్న విషయాన్ని నమ్మకం కలిగే రీతిలో వ్యాఖ్యలు చేయటం గమనార్హం.