Begin typing your search above and press return to search.

రైల్వేల ప్రైవేటీకరణపై పియూష్ గోయల్ కీలక ప్రకటన..

By:  Tupaki Desk   |   16 March 2021 10:30 AM GMT
రైల్వేల ప్రైవేటీకరణపై పియూష్ గోయల్ కీలక ప్రకటన..
X
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రోజుకో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేస్తునట్టు సంచలన ప్రకటనలు చేస్తుండటంతో ఎప్పుడు ఏయే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటిస్తుందో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. విమానాశ్రయాల్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం రెడీ అవుతోంది అని వార్తలు రాగానే, మరి రైల్వేల సంగతేంటి, అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పెద్ద దుమారం రేగుతుంది. ఈ విషయంపై విపరీతమైన చర్చలు జరుగుతుండటంతో దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పందించారు.

రైల్వేలను ఎప్పటికీ ప్రైవేటీకరించబోము అని చెప్పారు. అది విన్న రైల్వే ఉద్యోగులు, సాధారణ ప్రజలు కాసింత ఊపిరి అయితే పీల్చుకుంది అని చెప్పవచ్చు. అదే సమయంలో, పియూష్ గోయల్ గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం ఏవేవో హామీలు ఇచ్చి, వాటిని అమలు చెయ్యకుండా డ్రామాలు ఆడిందని విమర్శించారు. రైల్వే శాఖ ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటుంది అని కచ్చితమైన ప్రకటన చేశారు పియూష్ గోయల్. రైల్వేలను ప్రైవేటీకరిస్తామని మాపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.

కానీ ప్రజలెప్పుడు, ప్రభుత్వ వాహనాలు మాత్రమే రోడ్లపై తిరగాలి అని చెప్పలేదు. ఎందుకంటే, ఆర్థిక వ్యవస్థ నడవాలంటే... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వాహనాలన్నీ నడవాల్సిందే. ప్రైవేట్ పెట్టుబడులు రైల్వేలలోకి రావడాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే తద్వారా సేవలు మెరుగవుతాయి అని పియూష్ గోయల్ లోక్‌సభలో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... మన దేశ రైల్వే మౌలిక వసతులను సరికొత్త విజన్‌తో చూస్తున్నారు. కొత్త విజన్ ద్వారా రైల్వేలు... దేశంలోని అన్ని రంగాల అభివృద్ధికీ ఉపయోగపడతాయి. దేశ అభివృద్ధికి ఇంజిన్‌లా మేము భారత రైల్వే చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం అని అన్నారు. ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్లకు పైగా... రైల్వే మెరుగుదల కోసం కేటాయించినట్లు తెలిపారు. మొత్తంగా ఈ ప్రకటన చూస్తే ఇప్పట్లో కేంద్రం రైల్వే ను ప్రైవేటీకరణ చేయదు అని అనుకోవచ్చు.