Begin typing your search above and press return to search.
ఐన్ స్టీన్ గురుత్వాకర్షణ..పీయూష్ నవ్వులపాలు
By: Tupaki Desk | 13 Sep 2019 10:27 AM GMTఎవరు ఔనన్నా.. కాదన్నా.. యూపీఏ హయాంలోని కాంగ్రెస్ కేంద్ర మంత్రులతో పోలిస్తే అనుభవం, పరిపాలన విషయంలో ప్రస్తుత బీజేపీ కేంద్రమంత్రులు తేలిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే కనీసం సబ్జెక్ట్ పై పరిజ్ఞానం లేకుండా నోరుజారుతున్న కేంద్ర మంత్రుల వ్యవహార శైలి నవ్వుల పాలవుతోంది.
ఇటీవలే కార్ల అమ్మకాలు పడిపోవడానికి ఓలా, ఉబెర్ క్యాబులే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అనడం నవ్వులపాలైంది. దీన్ని కవర్ చేస్తూ తాజాగా మరో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ సైతం విలేకరుల సమావేశంలో నిర్మల సీతారామన్ కు సపోర్ట్ గా మాట్లాడపోయి పెద్ద తప్పుడు మాటను పలికాడు..‘ఆర్థికమంత్రి నిర్మల ఎకనామిక్స్ కూడా గురించి ఎవరూ ఎక్కువ ఆలోచించవద్దని.. ఐన్ స్టీన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టడానికి గణితం ఉపయోగపడలేదని ’ పీయూష్ సర్ధిచెప్పాడు.
నిజానికి నాలుగో తరగతి పిల్లవాడిని అడిగినా గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టింది ఐన్ స్టీన్ కాదు న్యూటన్ అని చెబుతాడు. ఈ సిల్లీ సమాధానం కూడా తెలియని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు సైన్స్ తెలియదో లేక నోరుజారాడో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ మాట అని సోషల్ మీడియాలో నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇది సోషల్ మీడియా కాలం.. ఏదీ తప్పుగా మాట్లాడినా నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. అలాంటిది ఇద్దరు కేంద్రమంత్రులు దొరకడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిని ఎండగడుతూ మీమ్స్, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అప్పట్లో ‘బీకాంలో ఫిజిక్స్’ అని వార్తల్లో నిలవగా ఇప్పుడు కేంద్రమంత్రి పీయూష్ కూడా గురుత్వాకర్షణ శక్తిని ఐన్ స్టీన్ కనిపెట్టాడని అభాసుపాలయ్యాడు. నెటిజన్ల జోకులకు బలవుతున్నాడు.