Begin typing your search above and press return to search.

`RRR` వ‌సూళ్ల‌పై కేంద్ర మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   3 April 2022 1:30 PM GMT
`RRR` వ‌సూళ్ల‌పై కేంద్ర మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్` బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే `బాహుబ‌లి `రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. `బాహుబ‌లి ది బిగినింగ్` 600 కోట్ల వ‌సూళ్ల‌ను కేవ‌లం 8 రోజుల్లోనే బ్రేక్ చేసింది. 750 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుని లిఖించింది. `బాహుబ‌లి `ప్రాంచైజీ టార్గెట్ గా బ‌రిలోకి దిగిన `ఆర్ ఆర్ ఆర్` అనుకున్న‌ది సాధించ గ‌ల్గింది.

తొలుత `బాహుబ‌లి` రికార్డుల‌ను `ఆర్ ఆర్ ఆర్` బ్రేక్ చేయ‌గ‌ల‌దా? ఇది సాధ్య‌మేనా? జ‌రిగే ప‌నేనా? అని కొంద‌రు సందేహ ప‌డ్డారు. కానీ చేత‌లు త‌ప్ప మాట‌లు చేత‌లు కానీ జ‌క్క‌న‌కి ఇలాంటివ‌న్నీ దిగ‌దుడుపేన‌ని మ‌రోసారి నిరూపించారు. దేశ వ్యాప్తంగా `ఆర్ ఆర్ ఆర్` వ‌సూళ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇండియ‌న్ ఎకాన‌మీలో సైతం `ఆర్ ఆర్ ఆర్` వ‌సూళ్లు చ‌ర్చ‌నీయంశంగా మారాయి.

తాజాగా కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్ సైతం `ఆర్ ఆర్ ఆర్` వ‌సూళ్ల తో రికార్డులు సృష్టించిన‌ట్లే భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ కూడా రోజుల్లో రికార్డు సృష్టిస్తుంద‌ని జోస్యం చెప్పారు. `ఆర్ ఆర్ ఆర్` 750 కోట్లువ వ‌సూళ్లు సాధించింద‌ని నేను కూడా విన్నాను. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నాను. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఎగుమతి సంఖ్య $418 బిలియన్లకు చేరుకోవడంపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హ‌ర్షం వ్య‌క్తం చేసారు.

మొత్తానికి `ఆర్ ఆర్ ఆర్` సెగ కేంద్రానికి కూడా తాకింది. కేంద్ర మంత్రులే `ఆర్ ఆర్ ఆర్` వ‌సూళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ సినిమా ఉత్త‌రాదిన కూడా పుంజుకున్న‌ట్లుగానే భావించ‌డానికి దీన్ని ఒక సంకేతంగా భావించొచ్చు. ఇక ప్ర‌ధాని మోదీజీ `ఆర్ ఆర్ ఆర్` గురించి మాట్లాడట‌మే బ్యాలెన్స్. సెల‌బ్రిటీల్ని మోదీ ఏ స్థాయిలో పొగిడేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు.

`ఆర్ ఆర్ ఆర్` విష‌యం ఆయ‌న‌కు తెలిస్తే ప్ర‌ధాని సైతం మెచ్చ‌కుండా ఉండ‌లేరు క‌దా. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం గుర్తించాలి. ప్ర‌ధాని మోదీ తెలుగు సినిమాల్ని త‌క్కువ చేస్తున్నార‌ని గ‌తంలో విమ‌ర్శ‌లొచ్చాయి. ఓ పెద్దింటి సెల‌బ్రిటీ కోడులు నేరుగా పీఎంని టార్గెట్ చేసి వ్యాఖ్యానించారు. తెలుగు న‌టులు..బాల‌వుడ్ న‌టుల‌కు ఏ మాత్రం తీసిపోరాని వ్యాఖ్యానించారు. ఓ వేడుక ఆహ్వానం లో భాగంగా మోదీ కేవ‌లం బాలీవుడ్ కే అతిధ్యం ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే మోదీపై అప్ప‌ట్లో టాలీవుడ్ నుంచి కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది.