Begin typing your search above and press return to search.

ఫ్రొఫెసర్ గారి మాటలకు పీకే ఫ్యాన్స్ ఫిదా

By:  Tupaki Desk   |   11 Dec 2019 6:05 AM GMT
ఫ్రొఫెసర్ గారి మాటలకు పీకే ఫ్యాన్స్ ఫిదా
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హాత్యాచార ఉదంతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసినట్లుగా చెప్పే వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాను చెప్పిన మాటల్ని తప్పుడు అర్థంతో ప్రచారం చేశారని పవన్ సోదరుడు నాగబాబుతో సహా జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
దిశ నిందితుల్ని చంపటం కంటే కూడా రెండు బెత్తం దెబ్బలు వేయాలన్నపవన్ మాటలు ఎంత ఎటకారం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అత్యాచారం చేసి కాల్చి చంపేయటం లాంటి తీవ్రమైన నేరాలకు రెండు బెత్తం దెబ్బలు సరిపోతాయా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. పవన్ అన్న మాటలకు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు.

తమను టార్గెట్ చేసి కొందరు పవన్ వ్యాఖ్యల్ని తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నాగబాబు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతుగా నిలిచారు. చర్మం ఒలిచేలా కొట్టాలని పవన్ వ్యాఖ్యానించారని.. నిజానికి ఆ శిక్ష ఉరిశిక్ష కంటే ఎక్కువంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

చర్మం ఒలిచేలా రెండు బెత్తం దెబ్బల బహిరంగ శిక్ష ఉరి కంటే కఠినమైనదని.. రేపిస్టుల్లో భయాన్ని కలిగిస్తుందన్నారు. ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వారికి బాధ ఉండదని.. బుల్లెట్ తగిలిన వెంటనే హాయిగా చనిపోతాడని.. కానీ బహిరంగంగా చర్మం ఊడేలా బెత్తం దెబ్బ వేస్తే అది మరింత పెద్ద శిక్షగా అభివర్ణించారు. పోలీసు లాఠీ దెబ్బ తింటే తెలుస్తుంది ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఫుల్ సపోర్ట్ పలికారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అందరూ పవన్ వ్యాఖ్యల్ని ఎటకారం చేసుకుంటున్న వేళ.. మేధావిగా ఇమేజ్ ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ నోటి నుంచి వచ్చిన మాటలకు పీకే ఫ్యాన్స్.. జనసేన నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.