Begin typing your search above and press return to search.
పీకే ఓ రాజకీయ వ్యభిచారి...750 కోట్లకు డీల్ కుదిరిందంటున్న కేఏ పాల్
By: Tupaki Desk | 9 May 2022 1:45 AM GMTరాజకీయ వ్యూహకర్తగా ఇటీవలి కాలంలో పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. పీకే ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అని కే ఏ పాల్ కొత్త పేరు పెట్టారు.
ఆయన ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తారో వారి దగ్గరకు వెళ్తారని, నేను 750 కోట్లు ఇస్తాను అని చెప్పాం… కానీ ఆయన కు అంత కంటే కాంగ్రెస్ ఎక్కువ ఇస్తుంది అనుకుంటా? అని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన కేఏ పాల్ ఇదే సమయంలో పీకే పై సైతం ఈ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.
ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో నిర్వహించిన సభపై సైతం కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ కోసం కాంగ్రెస్ పార్టీ 87కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ వాగ్ధానాలు అన్ని వింటే నవ్వు వస్తుందని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.
వరంగల్ డిక్లరేషన్‌లో పేర్కొన్నవి తెలంగాణ ప్రజలని మోసం చేయడం కోసమేనని ఆరోపించిన కేఏ పాల్ ఎందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మాయ మాటలు విని ప్రజలు మోసపోఎందుకు సిద్ధంగా లేరన్నా కేఏ పాల్.. ఎప్పుడైనా 70సంవత్సరాలలో రైతులకు గిట్టబాటు ధర ఇచ్చారా? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు దేశాన్ని, ప్రజలను మోసం చేశారని ఆరోపించిన కేఏ పాల్ అందుకే వారికి ఈ శిక్ష అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు అంత ఈ కుటుంబ పాలన వద్దు అని అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, అందుకే వారికి దేశంలో డిపాజిట్లు కూడా రావడంలేదన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 2005లో తన పీస్ మిషన్ ను రద్దు చేయించి లక్షలాది మంది పొట్ట కొట్టారని ఆరోపించారు.