Begin typing your search above and press return to search.
యూహకర్త కాదు.. పార్టీ అధినేతగా పీకే.. మరెన్ని దరిద్రాలు చూడాలో?
By: Tupaki Desk | 2 May 2022 5:29 AM GMTసమీకరణాలు వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం ఏదైనా రాజకీయ పార్టీకి వ్యూహకర్త సేవలు అందిస్తూ.. తన క్లయింట్ గా మారిన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా పని చేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఇప్పుడుపూర్తి స్థాయి రాజకీయనేతగా మారాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.
ఇంతకాలం ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తూ తెర వెనుక ఉండిపోయిన ఆయన తెర ముందుకు రావాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.
కొత్త పార్టీని ఏర్పాటు చేయటం.. దాని ప్రయాణం బిహార్ నుంచి షురూ చేయనున్నట్లుగా పీకే వెల్లడించారు. ఇప్పటికే తమ పార్టీకి సంబంధించిన పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసినట్లుగా చెబుతున్నారు.
పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలురూపొందిస్తూఅర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పని చేసినట్లుగా ఆయన చెప్పుకున్నా.. ఆయన పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన వారు ఏమేం చేశారో.. చేస్తున్నారో అందరికి తెలిసిందే.
కులానికి కులం.. మతానికి మతం.. ప్రాంతానికి ప్రాంతం.. ఎన్నికల్లో విజయం కోసం ప్రజల భావోద్వేగాల్ని అంకెల్లోకి మార్చేసి.. అందుకు తగ్గట్లు వ్యూహాల్ని సిద్ధం చేయటం ద్వారా.. ప్రజల్ని ప్రభావితం చేసిన పీకే.. ఇప్పుడు సొంత పార్టీ పెట్టి.. దాన్ని పవర్లోకి తెచ్చేందుకు మరెన్ని చీలికలు.. పీలికల్ని ప్రోత్సహిస్తారో చూడాలి.
ఆ క్రమంలో దేశానికి ఎదురయ్యే సవాళ్లు ఒక స్థాయిలో ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు.