Begin typing your search above and press return to search.

పీకే సైలెంట్ మోడ్‌... తెలంగాణ కాంగ్రెస్ అప్పుడే ఢీలా ప‌డిపోయింది

By:  Tupaki Desk   |   25 April 2022 3:35 AM GMT
పీకే సైలెంట్ మోడ్‌... తెలంగాణ కాంగ్రెస్ అప్పుడే ఢీలా ప‌డిపోయింది
X
ఎల‌క్ష‌న్ స్ట్రాట‌జిస్ట్ గుర్తింపుతో దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇవాళో రేపో కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని వస్తున్న వార్తల సమయంలో.. సడెన్‌గా హైద‌రాబాద్ రావ‌డం ప్రగతిభవన్‌కు ఎందుకు వెళ్లడం ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల‌కు షాకింగ్ వ‌లే మారిన సంగ‌తి తెలిసిందే.

కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చల కన్నా ముందే.. టీఆర్‌ఎస్‌ కోసం పనిచేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ అంగీకరించడం, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని వస్తున్న వార్తల సమయంలో.. సడెన్‌గా పీకే ప్రగతిభవన్‌కు ఎందుకు వెళ్లారు..? పీకే పాలిట్రిక్స్‌.. జాతీయ రాజకీయాలను ఏ మలుపు తిప్పనున్నాయి..? అనే చ‌ర్చ ఓ వైపు సాగుతుంటే పీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి స‌హా ఆ పార్టీ నేతలంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

పీకే కాంగ్రెస్ పార్టీలోకి చేర‌డం, హైద‌రాబాద్‌కు వ‌చ్చి కేసీఆర్ తో స‌మావేశం అవ‌డాన్ని వాస్త‌వంగా టీఆర్ఎస్ వ‌ర్గాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. అయితే, బ‌హిరంగంగా మాత్రం ఈ విష‌యం వెల్ల‌డించ‌డం లేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి మొద‌లుకొని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లౌక్యంగా స్పందిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతడని, ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని రేవంత్ అన్నారు. కాంగ్రెస్కు స్ట్రాటజిస్టుల అవసరం లేదని, తమ పార్టీలో నాయకులు తప్ప స్ట్రాటజిస్టులు ఉండరని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయబోతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండ్రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అవ‌డంపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. పీకే-కేసీఆర్ భేటీ విషయంపై తానేమీ మాట్లాడను అని చెప్పారు.

ఏ నిర్ణయం తీసుకున్నా.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. ప్రశాంత్ కిషోర్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పీకేపై అనుమానాలు రావడం సహజమే అయినా.. ఆయన విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. సీఎం కేసీఆర్, సోనియా గాంధీలతో పీకే సమావేశమవడంపై స్పందించడం తమ పరిధిలోని అంశం కాదని అన్నారు.