Begin typing your search above and press return to search.

పీకే టీం హెడ్ రిషి సింగ్ కి క్లాస్ పీకిన వైసీపీ హై కమాండ్?

By:  Tupaki Desk   |   20 Jan 2023 12:30 PM GMT
పీకే టీం హెడ్ రిషి సింగ్ కి క్లాస్ పీకిన వైసీపీ హై కమాండ్?
X
ఏపీ తెలంగాణాకు పీకే టీం హెడ్ గా రిషి సింగ్ ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా అతనే ఉన్నారు. ఇక ఏపీలో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఆ తరువాత రిషి సింగ్ పెళ్ళి చేసుకుంటే జగన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇక ఇపుడు చూస్తే ఏపీలో పీకే టీం వైసీపీకి పనిచేస్తోంది.

ఇక ఏపీలో పీకే టీం రిషి సింగ్ నాయకత్వంత్లోనే సర్వేలు చేస్తూ వస్తోంది. అయితే 2019 ఎన్నికలకు ముందు పీకే టీం కి యూత్ వాలంటీర్లు పనిచేసేవారు. అప్పట్లో యూత్ అంతా వైసీపీకి కనెక్ట్ అయి ఉండేది. దాంతో పీకే టీం పని కూడా చాలా సులువు అయింది. ఇపుడు చూస్తే జగన్ అఫీషియల్ పేజ్ లో కానీ లేక వైసీపీ అధికారిక పేజిలో కానీ పోస్టింగులకు లైక్స్ కానీ షేర్స్ కానీ చాలా తక్కువగా వస్తున్నాయిట.

ఒక గ్రామంలో ఉండే అతని కంటే కూడా తక్కువ లైక్స్ షేర్స్ వస్తున్నాయి అంటే మరి పీకే టీం ఇన్నాళ్ళలో ఏమి చేసినట్లు ఏమి సాధించినట్లు అని అంటున్నారు. అందుకే పీకే టీం కి వైసీపీ హై కమాండ్ క్లాస్ తీసుకుంటోంది అని అంటున్నారు.

నిజానికి ఈ సర్వేలు, పీకే టీం సేవలు అన్నీ కూడా 2019లో ఎంత ఉన్నా నాడు జగన్ కి భారీ ఎత్తున వేవ్ ఉండేది. ఆయనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని కూడా ఉండేది. అలాగే వైసీపీలో యూత్ వాలంటీర్లు కూడా బాగా పనిచేసేవారు. ఇపుడు చూస్తే సీన్ అంతా మారిపోయింది. నాలుగేళ్ల పాలన తరువాత జనాలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు.

అంతవరకూ ఎందుకు పార్టీతోనూ లేదు. ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక పీకే టీం సర్వేలు అని అంటున్నారు. మరి గ్రౌండ్ లెవెల్ దాకా పీకే టీం వెళ్తోందా నిజంగా వాస్తవాలు వస్తున్నాయా వచ్చినవి అన్నీ నిజాలేనా వారిని నమ్మాలా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

లైక్స్ షేర్స్ దారుణంగా పడిపోతున్నాక పీకే టీం గ్రౌండ్ లెవెల్ లో పీకేదేంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. నిజానికి ఫస్ట్ టైం ఒక పార్టీని గెలిపించడం వేరు. యాంటీ ఇంకెంబెన్సీ పెరిగిన తరువాత మరోసారి గెలిపించడం వేరు. ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. మరి రిషి సింగ్ ఈ విషయంలో ఏమి చేయగలుగుతారు అన్నది కూడా మరో చర్చగా ఉంది.

అయినా భారీ ఎత్తున ఒప్పందం కుదుర్చుకుని ఫీల్డ్ లోకి దిగాక తగిన విధంగా ఎంతో కొంత రిజల్ట్ చూపించాల్సి ఉంది. కానీ పీకే టీం పనితీరు మీద వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అంటే ఎక్కడో డౌట్ కొడుతోంది అనే అంటున్నారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీ ఏజెన్సీలు మంచి జరిగితే తమ వల్ల అని బిజినెస్ చేసుకుంటారు. లేకపోతే ఏవో కారణాలు చూపిస్తూ తప్పుకుంటాయి.

మొత్తానికి మోళీ కట్టడమే కన్సల్టెన్సీలకు తెలిసిన విద్య అయినపుడు అసలు వాస్తవాలు ఎపుడూ బయటకు రావు. మరి కన్సల్టెన్సీలనే నమ్ముకుని ఎపుడూ గెలుస్తామనుకుంటే చాలా ధనిక పార్టీలు ఇదే విధానాన్ని అనుసరిస్తాయి కదా పీకే టీం సెంటిమెంట్ గా తీసుకుని రెండవసారి వైసీపీ చాన్స్ ఇచ్చింది. ఇపుడు మెల్లగా డొల్లతనం బయటపడుతోంది. కానీ ఎన్నికల వేళ ఇపుడేమీ చేయలేదు అనే అంటున్నారు.

అయితే రేపటి ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ వచ్చినా రాకపోయినా పీకే టీం కి వైసీపీ చెక్ చెప్పి బయటకు పంపించడం ఖాయమనే అంటున్నారు. పీకే టీం నే గుడ్డినా నమ్ముకోకుండా ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఇకనైనా కళ్ళు తెరచి తాముగా జనంతో కనెక్ట్ అయితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అన్న సలహాలు వస్తున్నాయి. మరి దాన్ని ఎంత వరకూ స్వీకరిస్తారు అన్నది చూడాలి.

ఏది ఏమైనా ఇన్నాళ్ళూ పీకే టీం బ్రాండ్ అంటూ గొప్పగా ఊదరగొడుతున్న వారికి ఇపుడు పనితీరు నేలబారుడుగా ఉందని తేలడంతో వైసీపీ అధినాయకత్వం అలెర్ట్ కావాల్సిన సందర్భం వచ్చిందనే అంటున్నారు. మరి ఈ విషయంలో హై కమాండ్ తరువాత అడుగులు ఎలా ఉంటాయో చూడాల్సిందే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.