Begin typing your search above and press return to search.

యాంటీ బీజేపీ : బెంగాల్ సీఎం మమతా ప్లాన్ ఇదే

By:  Tupaki Desk   |   21 Aug 2021 7:00 PM IST
యాంటీ బీజేపీ : బెంగాల్ సీఎం మమతా ప్లాన్ ఇదే
X
దేశమంతా బీజేపీ గాలివీచినా బెంగాల్ లో మాత్రం ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మోడీ , అమిత్ షాలాంటి గండరగండరలు ఎదురొచ్చినా కూడా ధీటుగా ఢీకొట్టి పడగొట్టింది. ఇప్పుడు దేశంలో మోడీషాలకు బలమైన ప్రత్యామ్మాయ నేతగా మమతా బెనర్జీ నిలబడుతున్నారు.

ఈ క్రమంలోనే నిన్న సోనియాగాంధీతో వర్చువల్ మీటింగ్ లో మాట్లాడిన మమత సంచలన ప్రతిపాదన చేశారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే కోర్ గ్రూప్ ను ఏర్పాటు చేయాల్సిందేనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. ఇలాంటి గ్రూప్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని లోక్ తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కూడా ప్రతిపాదించారు.

దేశంలోని బలమైన బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని విపక్షాల ఐక్యతతో కూడిన కోర్ గ్రూప్ ఏర్పాటు అనివార్యమని..ప్రతి మూడు నాలుగు రోజులకోసారి ఈ గ్రూప్ సమావేశం కావాలని మమత సూచించారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పెద్ద పార్టీ గనుక ఈ గ్రూప్ నకు సోనియాగాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ అధ్యక్షత వహించాలని మమత అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతివారు ఇందుకు అంగీకరించారన్నారు.

వచ్చే ఎనికల్లో ఎన్డయే కూటమిని ఎలాగైనా ఓడించే లక్ష్యాన్ని పెట్టుకుంది కాంగ్రెస్. ఇందుకు ఒంటరిగా కాకుండా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఒంటరిగా కాకుండా కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రతిపక్ష నాయకులందరినీ కలుపుకకుపోతున్నారు. ఇటీవల ఆ పా్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలన్నింటికి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొందరితో ఎప్పుడూ టచ్లో ఉంటున్నారు. ఒక్కోసారి మెట్టు దిగి కొందరు చెబుతున్న సూచనలు పాటిస్తున్నారు.ఇటీవల వర్చువల్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతిపక్షాలన్నీ శరత్ పవార్ తో సహా ప్రతిపక్ష నాయకులందరూ హాజరయ్యారు. కానీ ఆప్, అకాలీదళ్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఇప్పటికే కమలం పార్టీపై వస్తున్న వ్యతిరేకతను అస్త్రాలుగా చేసుకొని వాటితో ప్రజల్లోకి వెళ్లనున్నారు. రైతు చట్టాలు, కోవిడ్ వైఫల్యం, పెగాసస్ వివాదం వంటి అంశాలను ప్రధానంగా చేసుకొని బీజేపీపై పోరాటం చేయనున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 543 సీట్లలో కాంగ్రెస్ కనీసం 136 సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. మిగిలిన సీట్లు బీజేపీ గెలుచుకున్నా టార్గెట్ రీచ్ కావాలని చూస్తోంది.

2019 ఎన్నికల ముందు కూడా మమతా బెనర్జీ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సాగాయి. జనవరిలో కోల్ కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి 22 పార్టీల నేతలు హాజరయ్యారు. కానీ రెండోసారి కూడా ఎన్టీయేనే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి థర్డ్ ఫ్రంట్ సమావేశాలు జరగలేదు. కానీ తాజాగా మరోసారి థర్డ్ ఫ్రంట్ తెరపైకి వస్తోంది. అదీ కాగా రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లోకి చేరడంతో ఆ కూటమికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అయితే పీకే లెక్కలు, వ్యూహాలు థర్డ్ ఫ్రంట్ ను విజయతీరానికి చేకూరుస్తాయా..? అన్న చర్చ సాగుతోంది. అయితే ప్రధాని గ్రాఫ్ తగ్గిందన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్లో మరోసారి జోష్ నింపింది. 2020లో 66 శాతంగా ఉన్న మోదీ గ్రాఫ్ ఈ ఏడాదికి 38 శాతానికి పడిపోయింది. ఆగస్టు నాటికి అది కేవలం 26 శాతానికి పడిపోయింది.

ఈ క్రమంలోనే మమతా బెనర్జీ చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇతరపక్షాలు మద్దతిచ్చాయి. సెప్టెంబరు 20 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ఉమ్మడిగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆందోళనలు కొనసాగాలని నిర్ణయించారు.