Begin typing your search above and press return to search.

బెంగాల్ లో బీజేపీని లేకుండా చేసే ప్లాన్?

By:  Tupaki Desk   |   4 Jun 2021 11:30 AM GMT
బెంగాల్ లో బీజేపీని లేకుండా చేసే ప్లాన్?
X
మొన్నీమధ్య జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికలు ముగిసి చాలా కాలం అయినా కూడా ఆ రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడడం లేదు. ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన దూకుడును ఎన్నికల తర్వాత టీఎంసీ చేస్తూ బీజేపీ నేతలను వేటాడేస్తోంది. చాలా మంది టీఎంసీలను లాగేస్తూ .. వినని వారిపై దాడులకు దిగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలను లాగే పనిలో బీజీగా ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 33 మంది టీఎంసీలో చేరబోతున్నారని.. బీజేపీకి గట్టి దెబ్బపడబోతోందని టాక్ నడుస్తోంది. ఇక వీరే కాదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కుమారుడు సుబ్రన్షు కూడా టీఎంసీలో చేరాలని డిసైడ్ అయ్యాడని టాక్.

గత బెంగాల్ ఎన్నికల్లో 294 సీట్ల బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ ఏకంగా 213 సీట్లు గెలిచింది. బీజేపీ 77 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు 50 మందికి పైగా టీఎంసీ నాయకులు బీజేపీలో చేరారు. ఇందులో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి బీజేపీ మాత్రమే గెలుస్తుందని వారికి పూర్తి ఆశ ఉండేది. బీజేపీ ఘోర ఓటమితో ఇప్పుడు ఏదైనా చేసి తిరిగి టీఎంసీలోకి వారు తిరిగి రావాలనుకుంటున్నారు. బెంగాల్ లో ప్రతిచోట అధికారంలో ఉన్న పార్టీ ప్రమేయం ఉంది. పార్టీ అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు. ఇక్కడ ప్రతిపక్షాల పాత్ర లేదని.. టీఎంసీ బీజేపీని లేకుండా చేయాలని పట్టుదలగా ఉన్నట్టు టాక్.