Begin typing your search above and press return to search.

మిస్ అయిన నేపాల్ విమానం కూలింది

By:  Tupaki Desk   |   24 Feb 2016 7:57 AM GMT
మిస్ అయిన నేపాల్ విమానం కూలింది
X
నేపాల్‌ కు చెందిన ఒక చిన్న విమానం బుధ‌వారం ఉద‌యం అదృశ్య‌మైన సంగ‌తి తెలిసిందే. 23 మందితో ప్ర‌యాణిస్తున్న ఈ విమానం టేకాప్ అయిన ఎనిమిది నిమిషాల‌కే కూలిపోయింది. తారా ఎయిర్‌లైన్స్ కు చెందిన ఈ విమానం నేపాల్‌లోని పొఖారా నుంచి జామ్‌ సోమ్‌ కు వెళ్లాల్సి ఉంది. బుధ‌వారం ఉద‌యం 7.45 గంట‌ల‌కు విమానాశ్ర‌యం నుంచి బ‌య‌లుదేరిన కొద్దిసేప‌టికి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే పొఖారా నుంచి జామ్‌ సోమ్‌ కు మ‌ధ్య ప్ర‌యాణ వ్య‌వ‌ధి 20 నిమిషాలు మాత్ర‌మే. ఇంత చిన్న ప్ర‌యాణ వ్య‌వ‌ధి విషాదంగా మార‌టం ప‌లువురిని క‌లిచి వేస్తోంది. అయితే.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఉన్న ఈ ప్ర‌యాణం అత్యంత క్లిష్ట‌మైన‌ద‌ని చెబుతున్నారు.

ఏదైనా అవాంత‌రం ఎదురైతే విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ఏ మాత్రం వీల్లేని విధంగా అక్క‌డి ప‌రిస‌రాలు ఉంటుంది. చుట్టూ ప‌ర్వ‌తాల మ‌ధ్య సాగే ఈ ప్ర‌యాణంలో తారా ఎయిర్ లైన్స్ విమానం సాంకేతిక కార‌ణాల‌తో కుప్ప‌కూలిన‌ట్లుగా చెబుతున్నారు.

పెద్ద శ‌బ్ధంతో కూలిపోయిన ఈ చిన్న విమానం.. వెంట‌నే పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిన‌ట్లుగా ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు వెల్ల‌డించిన‌ట్లుగా నేపాల్ కు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఈ విమానంలో 18 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు విదేశీయులు.. ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. ఐదుగురు క్రూ బృందం ఉన్న‌ట్లు తెలుస్తోంది.