Begin typing your search above and press return to search.
అచ్చం భూమిని పోలిన గ్రహం.. మహా సముద్రం కూడా!
By: Tupaki Desk | 27 Aug 2022 12:30 AM GMTవిశ్వంలో మనిషికి కనిపించని.. ఇంకా కనిపెట్టలేని అద్బుతాలెన్నో దాగి ఉన్నాయి. ఈ విశ్వం అంతుపట్టని రహస్యాలెన్నింటినో తనలో దాచుకుంది. అయితే ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు విశ్వాన్ని శోధిస్తూనే ఉన్నారు. తమకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రిల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు అచ్చం మన భూమిని పోలిన గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహం మన భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చెబుతున్నారు. డ్రాగన్ నక్షత్ర కూటమిలోని బైనరీ వ్యవస్థలో ఈ భూమిని పోలిని గ్రహం ఉందని వెల్లడించారు. ఇది భూమి కంటే సుమారు 70% శాతం పెద్దదని అంటున్నారు. ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సముద్ర గ్రహంగా దీన్ని పేర్కొనవచ్చని చెబుతున్నారు. దీనిపై మహా సముద్రాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ గ్రహానికి 'టాయ్-1452బి'గా దీనికి నామకరణం చేశారు.
ఈ గ్రహం ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, ఈ చిన్న నక్షత్రానికి, ఆ గ్రహానికి మధ్య దూరం కారణంగా ఈ గ్రహంపై నీళ్లు చాలా చల్లగా, లేదంటే చాలా వెచ్చగా ఉండవని అంటున్నారు. కెనడాలోని మాంట్-మెగాంటిక్ అబ్జర్వేటరీలో... అత్యంత కచ్చితమైన కొలతల కోసం రూపొందించిన స్పిరౌ పరికరాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని కనుగొన్నట్టు ఆస్ట్రోనామికల్ జర్నల్ వెల్లడించింది.
ఈ గ్రహం రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని.. ఇక్కడ లోతైన మహాసముద్రాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడ సంవత్సరం అంటే కేవలం 11 రోజులు మాత్రమేనని అంటున్నారు. 11 రోజులకే సంవత్సరం పూర్తవుతుందని పేర్కొంటున్నారు. నక్షత్రం చుట్టూ తన భ్రమణాన్ని 11 రోజుల్లోనే పూర్తి చేస్తుందని చెబుతున్నారు.
మన సూర్యుడి నుంచి శుక్ర గ్రహానికి ఏ స్థాయిలో కాంతి అందుతోందో అదే స్థాయిలో ఈ కొత్త గ్రహానికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుందని అంటున్నారు. ఈ మహాభూమి తన రెండో నక్షత్రం చుట్టూ తిరగడానికి దాదాపు ఏకంగా 1,400 సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు.
ఈ గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రం ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ... నాసా వెల్లడించిన వివరాల ప్రకారం.. మంచు ఫలకాల క్రింద మహా సముద్రాలు ఉన్నట్లుగా ఈ కొత్త గ్రహంలోనూ మహా సముద్రం ఉంది.