Begin typing your search above and press return to search.

తెచ్చి పెట్టిన చీపుర్లన్నీ బండికెక్కించేశారు

By:  Tupaki Desk   |   11 March 2017 2:12 PM GMT
తెచ్చి పెట్టిన చీపుర్లన్నీ బండికెక్కించేశారు
X
గెలుపు సంబరాలు చేసుకోవటం మాత్రమే మిగిలి ఉందని ఫీల్ అయ్యే వారి ఏర్పాట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఊహించనిరీతిలో ఓటర్లు ఇచ్చిన షాక్ తో ఆగమాగం కావటం కామనే. తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది ఆమ్ ఆద్మీనేతలకు అనుభవంలోకి వచ్చింది.

2014సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా పంజాబ్ లో ఫలితాలు సాధించటంతో.. ఆ రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పక్కా అన్న ఫీలింగ్ ఆమ్ ఆద్మీ అధినేత.. ఢిల్లీ రాష్ట్రముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కాసింత ఎక్కువనే చెప్పాలి. అదే ధీమాతో గెలుపు అవకాశం ఉన్న పంజాబ్ మీద ఫోకస్ తగ్గించి.. అత్యుత్సాహంతో గోవా మీద ఫోకస్ చేశారు. దీంతో.. గెలుపు పక్కా అని పీల్ అయిన పంజాబ్ లో కొద్ది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి రాగా.. గోవాలో ఖాతా కూడా తెరవని దుస్థితి. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిన చందంగా.. పంజాబ్ లో గెలవాల్సింది పోయి.. రెండు చోట్లా ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

పంజాబ్ రాష్ట్రంగా పాగా వేయటం పక్కా అని ఫీల్ కావటమే కాదు.. అందుకు తగ్గట్లే సంబరాలకు ముందస్తు ఏర్పాట్లును చేసుకుందా పార్టీ. అయితే.. ఊహించని రీతిలో పార్టీ ఓటమిపాలు కావటంతో..నేతలు..కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి రావటానికి కూడా ఇష్టపడలేదు. దీంతో పార్టీ కార్యాలయ పరిసరాలన్నీ జనం లేక బోసిపోయాయి.

ఇక.. పంజాబ్ లో గెలుపు ధీమాతో ముందస్తుగా.. పార్టీ గుర్తు అయిన చీపుర్లను పెద్ద ఎత్తున తెచ్చి పెట్టుకున్నారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇంటికి పెద్ద ఎత్తున చీపుర్లను తెచ్చి సంబరాలకు సిద్ధం చేశారు. అయితే.. పార్టీ పరాజయం కావటంతో.. తెచ్చి పెట్టిన చీపుర్లతో పని లేదని.. తీసుకొచ్చిన చీపుర్లను వాహనాల్లోకి ఎక్కించి మరీ..తిరిగి పంపిస్తున్న వైనం మీడియా కంట్లో పడ్డారు. దీంతో.. తరలిస్తున్న చీపుర్ల ఫోటోలు తీయటానికి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/