Begin typing your search above and press return to search.
జగన్ పై కత్తితో దాడి.. పక్కా ప్లాన్ తోనే..!
By: Tupaki Desk | 25 Oct 2018 9:07 AM GMTఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కత్తితో దాడి జరిగింది. చుట్టూ పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది.. పార్టీ నేతలు.. ఫాలోయర్స్ లాంటి వాళ్లు ఉన్నప్పుడు అంతలా దాడి ఎలా జరిగింది? అసలు.. ఎయిర్ పోర్ట్ లోకి కత్తి ఎలా వచ్చింది? అది కూడా కోడి పందెల్లో ఉపయోగించే కత్తి కావటం.. దాడికి పాల్పడిన యువకుడు ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్లో వెయిటర్ కావటం గమనార్హం.
జగన్ పై కత్తితో జరిగిన దాడిని సునిశితంగా పరిశీలిస్తే.. ఇది పక్కా ప్లాన్ అన్న మాట ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే.. ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్లో పని చేస్తున్న జానివెల్లి శ్రీనివాస్ కొద్దినెలలుగా మాత్రమే పని చేస్తున్నాడు. అంతేకాదు.. తాను జగన్ అభిమానిగా అదే పనిగా చెప్పుకునేవాడట. తన అన్న జగన్ తర్వాతి ఎన్నికల్లో విజయం సాధిస్తాడని.. 160 సీట్లు గెలుస్తాడని.. కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యలు చేసేవాడట.
వాస్తవానికి నాంపల్లి కోర్టు వాయిదాకు హాజరయ్యే క్రమంలో ప్రతి గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు జగన్ వెళుతున్నారు. విపక్ష నేత చేస్తున్న పాదయాత్ర గోదావరి జిల్లాల నుంచి కూడా ఆయన హైదరాబాద్‌కు విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచే వెళుతున్నారు. దీంతో.. ప్రతి గురువారం ఒకే టైంకు జగన్ ఎయిర్ పోర్ట్‌కు రావటం అలవాటైంది.
ఎయిర్ పోర్ట్ కు వచ్చే జగన్ కు టీ.. కాఫీలు అందించేందుకు ఒక వెయిటర్ వచ్చేవాడు. కానీ.. ఈసారి మాత్రం శ్రీనివాస్ ను పంపారు. మొదట్నించి జగన్ అంటే వీరాభిమాని అన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన అతగాడు ఈ వారం తానే సర్వ్ చేస్తానని చెప్పి మరీ టీ.. వాటర్ బాటిల్ తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.
నవ్వుతూ జగన్ వద్దకు వెళ్లి.. అన్నా..ఈసారి 160 సీట్లు వస్తాయన్న.. గెలుపు మనదే అన్నా అంటూనే కత్తితో పొడిచే ప్రయత్నం చేయటం గమనార్హం. తొలుత తాను ఇవ్వాల్సిన వాటర్ బాటిల్.. టీ ఇచ్చిన తర్వాత సెల్ఫీ తీసుకుంటానని అనుమతి తీసుకున్న శ్రీనివాస్..జగన్ అనుమతించటంతో ఆయనకు దగ్గరగా వచ్చారు. జేబులో చేయి పెట్టి కోడి పందెల్లో వాడే కత్తిని తీసి.. మెడ మీద గాయం చేయటమే లక్ష్యంగాదాడికి ప్రయత్నించారు.
సెకనులో వెయ్యివంతులో దాడి జరుగుతున్న వైనాన్ని గుర్తించి.. వెంటనే పక్కకు జగన్ వంగటంతో కత్తి వచ్చి భుజానికి తగిలి గాయమైంది. ఊహించని రీతిలో చోటుచేసుకున్న ఈ పరిణామానికి అక్కడున్న వారు షాక్ తిన్నారు. వెంటనే తేరుకొని వెయిటర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులకు అప్పగించారు.
ఇదిలా ఉంటే.. ఎయిర్ పోర్ట్ లోకి ఈ కత్తి ఎలా వచ్చి ఉంటుంది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. శ్రీనివాస్ తీరు చూస్తే.. భారీ ప్లాన్ తోనే విశాఖ ఎయిర్ పోర్ట్ లో వెయిటర్ గా చేరి ఉంటారన్న విషయం అర్థమవుతోంది. అతడ్ని విచారించి.. వివరాలు సేకరించటం ద్వారా అతని మూలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జగన్ పై దాడికి పక్కా వ్యూహాన్ని అమలు చేసినట్లుగా చెప్పాలి.
చిన్న కత్తితో దాడి చేయటానికి పాల్పడటం సంచలనం కోసమన్న మాట కొందరు చెబుతున్నా అది నిజం కాదు. ఎందుకంటే.. అదే చేసి ఉంటే.. మెడను లక్ష్యంగా చేసుకొని కత్తితో పొడిచే ప్రయత్నం చేయరని మర్చిపోకూడదు. అంతేకాదు.. తాను జగన్ వీరాభిమాని అని చెప్పుకుంటూ రోజుల తరబడి జగన్ ను పొగుడుతూ ఉండడు. చూస్తుంటే.. శ్రీనివాస్ వెనుక భారీ కుట్రతో పాటు.. అతన్ని పక్కాగా ట్రైన్ చేసి పంపినట్లుగా చెప్పాలి.
ప్రొఫెషనల్ కిల్లర్స్ కంటే మిన్నగా.. నవ్వుతూ ఎదురెళ్లి.. ఎలాంటి త్రోటుపాటుకు గురి కాకుండా.. సెల్ఫీ అడిగి మరీ కత్తితో దాడికి ప్రయత్నించటం చూస్తే.. వెనుక పెద్ద కథే ఉండి ఉండాలన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ఎయిర్ పోర్ట్ లోకి కత్తి తీసుకొని ఎలా రాగలిగాడన్నది ఇప్పుడు సందేహం గా మారింది. చూస్తుంటే.. జగన్ పై దాడికి ఉపయోగించిన కత్తిని ఈ రోజుకు ఈ రోజు సిద్ధం చేసుకున్నది ఎంత మాత్రం కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఏ విధంగా అయితే తాను జగన్ వీరాభిమానిన్న బిల్డప్ ఇచ్చిన శ్రీనివాస్.. తన వ్యూహాన్ని అమలు చేయటానికి వీలుగా కత్తిని.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలకు తీసుకొచ్చి ఉండి ఉండొచ్చు. హైదరాబాద్ తో పోలిస్తే.. విశాఖ విమానాశ్రయం చాలా చిన్నదన్నది మర్చిపోకూడదు. అక్కడి సిబ్బంది వారాల్లో సుపరిచితులుగా మారే అవకాశం ఉంది. తన ప్లాన్ ను అమలు చేసేందుకు సమయాన్ని తీసుకున్న శ్రీనివాస్ తీరు చూస్తుంటే.. జగన్ పై జరిగిన దాడి వెనుక భారీ ఎత్తున కుట్ర ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.