Begin typing your search above and press return to search.
వల్లభనేని వంశీ ప్లాన్.. కేవలం చీప్ పబ్లిసిటీ!
By: Tupaki Desk | 30 Oct 2019 5:30 PM GMTవల్లభనేని వంశీ మోహన్..ప్రచారం కోసం ఏదేదో చేస్తూ ఉంటాడు. ఎన్నికల ఫలితాలు రాక ముందే తన పోటీదారు యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వెళ్లడం వంశీ చేసిన ఒక పబ్లిసిటీ స్టంట్. యార్లగడ్డ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారంటూ.. ఆయనను అభినందించడానికి తను వెళ్లినట్టుగా వంశీ ప్రకటించుకున్నాడు. అదంతా ఒక వెకిలి పని.
ఎన్నికల ఫలితాల్లో ఏదో స్వల్ప ఓట్ల తేడాతో వంశీ మోహన్ బయటపడ్డాడు. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యింది. అయితే ఇంతలోనే ఆయన చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు.
తెలుగుదేశం పార్టీని వీడతానంటూ లీకులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడుకు వాట్సాప్ రాజీనామాలు పంపించాడట. బీజేపీ ఎంపీని కలవడం - ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు పోవడం.. ఆ తర్వాత ఏ మాటా చెప్పకుండా కామ్ గా ఉండిపోవడం. ఇదీ వల్లభనేని వంశీ మోహన్ కథ!
ఇదంతా ఎందుకు? అంటే.. ఇదంతా ఒక చీప్ పబ్లిసీటీ అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. వంశీ మోహన్ ఇలాంటి పబ్లిసిటీ పనులు చేస్తూ ఉంటారు. గతంతో ఫలితాలు రాకముందే వెంకట్రావు ఇంటికి వెళ్లింది కూడా అలాంటి పబ్లిసిటీ కార్యమే.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సూటిగా రాజీనామా చేయకుండా - బీజేపీ వాళ్లను - వైసీపీ వాళ్లను కలవడం కూడా అలాంటి చీప్ పబ్లిసిటీ కోసమే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఏతావాతా వంశీ ఈ ఎపిసోడ్ తో ఇప్పుడు ఉచిత పబ్లిసిటీ పొందవచ్చు. మీడియాలో - సోషల్ మీడియాలో తన పేరు నానేలా చేసుకోవచ్చు. అయితే దాని వల్ల తను మరింత పలుచన కావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వంశీ ఏదో ఒక పార్టీలో చేరినా.. ముందు ముందు అతడిని నమ్మే వారు మాత్రం ఎవ్వరూ ఉండరనే టాక్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో.