Begin typing your search above and press return to search.
బాబు సీక్రెట్ మెయింటైన్ లేకపోతే ఎలా..!
By: Tupaki Desk | 25 Jun 2016 12:27 PM GMTమంత్రి వర్గ సమావేశం అనగానే.. ఎన్నో ముఖ్యమైన - రహస్యమైన విషయాలపై సీఎం ఆయా మంత్రివర్గంతో చర్చించే అతి ముఖ్యమైన వేదిక. బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ సమావేశానికి కేవలం మంత్రి వర్గంలోని వారు మాత్రమే హాజరుకావాలి. అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాల్గొనే వెసులుబాటు ఉంటుంది. కానీ, ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కేబినెట్ భేటీలకు మంత్రి వర్గంలోని వారే కాకుండా ప్రభుత్వం నియమించిన సలహాదారులు కూడా హాజరవుతున్నారు. ఇప్పడు ఇదే చంద్రబాబుకు తీరని విమర్శలు వచ్చేలా చేస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు మంత్రివర్గ పవిత్రతను మంటగలుపుతున్నారని అధికారులే ఇన్నర్ గా వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం వ్యవహార శైలి.. ఓ రకంగా ఓత్ ఆఫ్ సీక్రెసీకి విఘాతం కలిగించటమేనన్న టాక్ కూడా వినిపిస్తోంది.
విషయంలోకి వెళితే.. అమరావతికి సంబంధించి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ..స్విస్ ఛాలెంజ్ విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావుతోపాటు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. వీరికి కేబినెట్ హోదా ఉన్నా…మంత్రివర్గంలో కూర్చోవడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ, వీరిద్దరూ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోలోనే స్పష్టంగా కన్పిస్తోంది. దీంతో మంత్రివర్గంలో లేనివారు కేబినెట్ భేటీకి ఎలా హాజరవుతారంటూ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మంత్రివర్గ సమావేశానికి అవసరం అయినప్పుడు నిపుణులను పిలిచి వారి సలహాలు..సూచనలు స్వీకరించవచ్చని..కానీ మంత్రివర్గ సమావేశం ఆసాంతం వారిని సమావేశంలో కూర్చోపెట్టడం నిబంధనలను ఉల్లంఘించటమేనని కొందరు అధికారులు బాబు తీరుపై అసంతృప్తితో ఉన్నారు.
ఇదిలావుంటే, కేబినెట్ భేటీకి హాజరైన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం సృష్టిస్తున్నాయి. వివాదస్పద స్విస్ ఛాలెంజ్ విధానానికి ఆమోదం పొందటంతో పాటు…ముసాయిదా తయారీలో తాను కీలక పాత్ర పోషించానని..స్వయంగా అంతా చూశానని..కళ్లు మూసుకుని సంతకం పెట్టొచ్చని అనడం ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది. కుటుంబరావు వ్యాఖ్యలపై మౌలిక సదుపాయాల శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో ఇలాంటి వారికి అవకాశం కల్పించి చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి విఘాతం కల్పిస్తున్నారని వారు అంటున్నారు. చంద్రబాబు సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అధికారులు ఆఫ్ ది రికార్డ్‌గా చెపుతున్నారు.