Begin typing your search above and press return to search.

ప్లాస్మా థెరఫీ ముందుకి సాగే దారేది !

By:  Tupaki Desk   |   25 April 2020 12:30 AM GMT
ప్లాస్మా థెరఫీ ముందుకి సాగే దారేది !
X
కరోనా మహమ్మారి ... ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. మన దేశంలో కూడా ఈ కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. దేశంలో కరోనా మహమ్మారి విస్తరించకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు. ఇక ఈ కరోనా కి సరైన వ్యాక్సిన్ లేక పోవడం కూడా దీని వ్యాప్తికి మరో కారణం.

ఈ నేపథ్యం లో ప్లాస్మా థెరఫీ చేస్తే కరోనా రోగులని కాపాడవచ్చు అని వైద్యులు చెప్పడంతో ..కరోనా చికిత్స కోసం భారత వైద్య పరిశోధన మండలి ప్లాస్మా థెరఫీకి అనుతినిచ్చింది. ప్రయోగాత్మకంగా ముంబైలో దీనిని నిర్వహించాలని సూచించింది. అయితే క్షేత్ర స్థాయిలో ప్లాస్మా దాతలు దొరక్కపోవడం వల్ల ఈ చికిత్సా విధానం ముందుకు సాగడం లేదు. ప్లాస్మా థెరఫీలో భాగంగా.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మాను సేకరిస్తారు.

అలా సేకరించిన ప్లాస్మా ను మరో రోగికి ఎక్కిస్తారు. దీనిలో యాంటీబాడీస్‌ రోగి తొందరగా కోలుకోవడానికి తోడ్పడతాయి. కానీ కరోనా ‌ నుంచి కోలుకున్న వారు రక్తం ఇవ్వడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. ముంబైలో 500 మందికి పైగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా .కనీసం.పది మంది కూడా ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రాలేదని వైద్యులు చెబుతున్నారు. వచ్చిన వారిలో కొందరి ప్లాస్మాలో తగినన్ని యాంటీబాడీస్‌ లేవని, దానిని చికిత్సకు వాడలేమని చెప్తున్నారు. దీంతో ఐసీఎంఆర్‌ అనుమతిచ్చినా ప్లాస్మా థెరఫీ ముందుకు సాగడం లేదని అధికారులు చెప్తున్నారు.