Begin typing your search above and press return to search.
నేటి నుంచే మహారాష్ట్ర ప్లాస్టిక్ బ్యాన్
By: Tupaki Desk | 23 Jun 2018 1:18 PM GMTప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే..ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడేస్తున్నారు. అవగాహన లేమి, ప్రత్యామ్మాయం లేకపోవడంతో ప్లాస్టిక్ ను మన నిత్య జీవితంలో భాగమైపోయింది.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదివరకూ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, నగర పాలక సంస్థలు ప్రకటించిన విధంగా కాకుండా మహారాష్ట్ర లో సంపూర్ణంగా ప్లాస్టిక్ ను నిషేధించింది. నోటిఫికేషన్ ప్రకారం తయారీ - వాడకం - అమ్మకం - పంపిణీ - ప్లాస్టిక్ మెటీరియల్ స్టోర్ చేసుకోవడం వంటి వాటన్నింటిని నిషేధించింది.
దీన్ని ఉల్లంఘించిన వారికి భారీగానే జరిమానా విధిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు కప్పులు, బ్యాగ్లు, కంటైనర్లు, ఆహారాన్ని నిల్వ చేసే ప్లాస్టిక్ వస్తువులపై కూడా నిషేధం విధించింది.
అంతేకాదు ప్లాస్టిక్ మొదటిసారి వాడి పట్టుబడితే 5000వేల రూపాయల జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. రెండోసారి పట్టుబడితే రూ.10వేలు.. మూడో సారి కూడా అలానే జరిగితే రూ.25వేలు ఫైన్ కట్టడంతోపాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. ఇక ఇప్పటినుంచి మహారాష్ట్రలోని మాల్స్ లలోనూ ప్లాస్టిక్ బ్యాగులు అందుబాటులో ఉండవు.. ఇక ప్యాకేజీంగ్ మెటీరియల్ - థర్మోకోల్ ఉత్పత్తులపై కూడా నిషేధాన్ని విధించి మహారాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే మెడిసన్ అండ్ డ్రగ్స్ - పాలు - సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లలో ప్లాస్టిక్ వాడవచ్చని నిషేధం నుంచి మినహాయించింది.