Begin typing your search above and press return to search.

ప్లాస్టిక్ కోడిగుడ్డు కలకలం..

By:  Tupaki Desk   |   1 Aug 2018 8:39 AM GMT
ప్లాస్టిక్ కోడిగుడ్డు కలకలం..
X
ప్లాస్టిక్ బియ్యమే కాదు.. ఇక్కడ ప్లాస్టిక్ కోడిగుడ్డు కూడా బయటపడింది. కోడికి ప్లాస్టిక్ తినిపించారా..? లేక ప్లాస్టిక్ కోడిగుడ్లనే తయారు చేశారా అన్న సందేహం అక్కడి వారిని పట్టిపీడించింది. తాజాగా కోడిగుడ్డులో ప్లాస్టిక్ పొడి బయటపడ్డ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నగరంలో చోటుచేసుకుంది.

బళ్లారి నగరం సంగనకల్లు రహదారిలోని గాంధీనగర్ హౌసింగ్ బోర్డు లో నివాసం ఉంటున్నచంద్రశేఖర్ తన ఇంటి సమీపంలో ఉన్న ఓ దుకాణంలో కోడిగుడ్లను కొనుగోలు చేశాడు. ఓ గుడ్డును అమ్లెట్ వేసేందుకు ప్రయత్నించగా జారి కిందపడిపోయింది. కొద్దిసేపటికి గుడ్డులోని తెల్లసొన ప్లాస్టిక్ పొడి మాదిరిగా మారిపోయింది. ప్లాస్టిక్ మాదిరిగా తయారైన పొడిని తీసుకొని పశుసంవర్ధక శాఖాధికారి డా. శశిధరకు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన దాన్ని ప్రయోగశాకు పంపారు.

ప్లాస్టిక్ కోడిగుడ్లపై సమాచారం అందుకున్న అహార తనిఖీ అధికారులు కోడిగుడ్లు విక్రయించిన దుకాణాన్ని పరిశీలించి గుడ్లను సేకరించారు. వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు. ఎన్ని రోజులు నిల్వ ఉన్నాయనే వివరాలు సేకరించారు. ప్లాస్టిక్ కోడిగుడ్డా.? కాదా అన్నది ప్రయోగాల అనంతరమే తేలుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. ఏదేమైనా సంపూర్ణ ఆహారమైన చవకగా దొరికే కోడిగుడ్లను కూడా కల్తీ చేశారా అన్న భయాందోళనలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.