Begin typing your search above and press return to search.

మ‌రో వివాదంలో కేసీఆర్ .. భ‌ద్రాద్రి రామ‌య్యే సాక్షి

By:  Tupaki Desk   |   12 May 2022 4:28 AM GMT
మ‌రో వివాదంలో కేసీఆర్ .. భ‌ద్రాద్రి రామ‌య్యే సాక్షి
X
పాల‌న ప‌రంగా ద బెస్టు అని అనిపించుకోవాల‌న్న తాప‌త్ర‌యం టీఆర్ఎస్-కు ఉన్నా కూడా, యంత్రాంగంలో ఉన్న నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగా త‌రుచూ వివాదాలు వ‌స్తూనే ఉన్నాయి. పాల‌న ప‌రంగా ఉన్న లోపాలు దిద్దుకునేందుకు సంబంధిత చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో మంత్రులు అధినాయ‌క‌త్వం ఆలోచ‌నల‌కు అనుగుణంగా లేరు అన్న వాద‌న మ‌రోవైపు వినిపిస్తుంది.

రేష‌న్ డిపోల్లో త‌రుచూ త‌నిఖీలు లేని కార‌ణంగానే ఇటువంటి ఘ‌ట‌నలు చోటు చేసుకుంటున్నాయ‌ని, అత్యంత ప్ర‌మాద‌కర రీతిలో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ పంపిణీ చేస్తున్న బియ్యం ఉంద‌న్న వాస్త‌వం గుర్తించ‌కుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ప్ర‌జానీకం మండిపడుతోంది.

మ‌రో వివాదంలో కేసీఆర్ స‌ర్కారు ఇరుక్కుంది. భ‌ద్రాద్రి రామ‌య్య కొలువున్న ప్రాంతంలో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ పంపిణీ చేస్తున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం క‌లిసి వ‌స్తుంద‌ని వినియోగ‌దారులు ఆధార స‌హితంగా నిరూపిస్తున్నా సంబంధిత అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో వివాదం ఎటు తిరిగి ఎటు పోతుందో అన్న ఆందోళ‌నలు ఓ వైపు అధికార పార్టీలోనూ మరోవైపు ప్ర‌జ‌ల్లోనూ నెల‌కొంది.

ఇప్ప‌టికే టీఆర్ఎస్ పాల‌క‌వ‌ర్గంపై అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ బియ్యం సర‌ఫ‌రా అనంత‌రం వండుకున్న తిన్న వారికి క‌డుపులో నొప్పి వ‌స్తుంద‌ని బాధితులు చెబుతున్నారు.

బియ్యాన్ని వేడి నీళ్ల‌లో వేయడంతో ప్లాస్టిక్ పైకి తేలింది. ప్ర‌స్తుతానికి రెవెన్యూ అధికారులు ఈ స‌మ‌స్య‌ను గుర్తించి, ప‌రిష్కారానికి రంగంలోకి దిగినా త‌రువాత కాలంలో ఇదే వేగంతో పని చేయ‌కుంటే మ‌రిన్ని ఉదంతాలు వెలుగు చూడ‌క త‌ప్ప‌దు.