Begin typing your search above and press return to search.

రసిక ప్రియులకు షాకిచ్చిన ‘ప్లేబాయ్’

By:  Tupaki Desk   |   20 March 2020 10:30 PM GMT
రసిక ప్రియులకు షాకిచ్చిన ‘ప్లేబాయ్’
X
ప్లేబాయ్.. ప్రపంచ రసిక ప్రియులకు పరిచయం అక్కర్లేని దిగ్గజ రోమాంటిక్ పత్రిక. 1960లో అమెరికాలో ప్రారంభమైన ‘ప్లేబాయ్’ పత్రిక సెక్స్ విప్లవాన్ని సృష్టించింది. నగ్న చిత్రాలతో పత్రికను రూపొందించి కుర్రకారును ఆకర్షించి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించింది. 1970లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పత్రికకు ఆదరణ తగ్గడంతో ఇంటర్నెట్ లోకి ప్రవేశించి డిజిటల్ పత్రికగాను సేవలందించింది.

ప్లేబాయ్ పత్రిక ముఖచిత్రంపై ఒక్కసారైనా పడాలని ఆరాటపడే హాలీవుడ్ తారలు ఎంతో మంది ఉండేవారు. చాలా మందిని పాపులర్ చేసిన ఘనత ప్లేబాయ్ పత్రిక సొంతం. అలాంటి సంస్థ ఇప్పుడు కరోనా కారణంగా మూతపడే స్టేజికి వచ్చేసింది.

కరోనా వైరస్ వల్ల పత్రికకు పనిచేసే క్రియేటివ్ ఎడిటర్లు అందుబాటు లో ఉండబోరని.. ప్రచురణ కూడా కష్టతరం కానుందని భావించిన ప్లేబాయ్ నిర్వాహకులు చివరి ఎడిషన్ ప్రచురించి.. ఇక ‘ప్లేబాయ్ పత్రిక’కు వీడ్కోలు పలకాలని నిర్ణయించారు. ఇక కేవలం ప్రత్యేక ఎడిషన్లు మాత్రమే ప్రింట్ చేస్తారు.

ఈ మేరకు ప్లేబాయ్ సీఈవో బెన్ కాన్ మాట్లాడారు.. 2021 నుంచి పూర్తిగా డిజిటల్ కంటెంట్ ద్వారానే వినియోగదారులకు సరికొత్త కథనాలు, గ్యాలరీలను అందిస్తాం. ప్లేబాయ్ ఎడిషన్ల ప్రచురణ మాత్రమే నిలిచిపోయింది అంటూ రసిక ప్రియుల గుండెల్లో బాణాలు దించేశారు.