Begin typing your search above and press return to search.

బొమ్మలతో ఆడుతూ.. ఏడాదికి రూ. 200 కోట్ల సంపాదన..!

By:  Tupaki Desk   |   20 March 2022 11:30 AM GMT
బొమ్మలతో ఆడుతూ.. ఏడాదికి రూ. 200 కోట్ల సంపాదన..!
X
బొమ్మలతో ఆడుకోవడం అంటే చాలా మంది చిన్నారులకు సరదాగా ఉంటుంది. వాటిని చుట్టూ పేర్చుకుని వారికి ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు. ఆ ఆటల్లోనే తమ ఆనందాన్ని కూడా వెతుక్కుంటారు చిన్న పిల్లలు. ఒక బొమ్మ తో ఆడుకోవడం అది నచ్చకపోతే పక్కన పడేయడం లాంటివి కూడా చేస్తుంటారు. ఇలా బొమ్మలతో ఆటలు ఆడుకోవడం అనేది వారి దినచర్యలో భాగం.

అందుకే షాపింగ్ కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు బట్టలు తీసుకోవడం కంటే ఎక్కువ భాగం బొమ్మలు కొని ఇవ్వండి అని అమ్మ నాన్నలను అడుగుతుంటారు. ఒక వేళ వారు వద్దు అంటే.. వారి ఏడుపుతో సరిగమపదనిస స్టార్ట్ చేస్తారు. క్లుప్తంగా చెప్పాలి అంటే పిల్లలకు, బొమ్మలకు మధ్య ఉండే బంధం. అయితే ఓ అమ్మాయి మాత్రం ఇంతటితో ఆగడం లేదు. కేవలం బొమ్మలతో ఆటలు ఆడుతూనే కోట్లు సంపాదిస్తుంది. ఏంటి ఆ కోట్లు.. ఎలా సంపాదిస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా.. నిజం. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు కోట్ల రూపాయల డబ్బు ఎలా సంపాదిస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రష్యాకు చెందిన అనస్తాసినా అనే బాలిక కు సరిగ్గా 8 ఏళ్ళు వయసు ఉంటుంది. ప్రస్తుతం ఆమె సంపాదించే మొత్తం వింటే చిన్న వాళ్ళు కానీ.. పెద్ద వాళ్ళు కానీ ఎవరు అయినా షాక్ అయ్యి తీరాల్సిందే. ఎందుకంటే ఆ చిన్నారి ఏడాది సంపాదన ను ఎవరూ ఊహించలేరు. ఒక్క చిన్నారికి అంత సంపాదన ఎలా సాధ్యం అని భావిస్తారు. ఇంతకీ ఆ బాలిక వార్షిక ఆదాయం ఎంత అంటే సుమారు గా రూ. 200 కోట్లు. అంత మొత్తం ఎలా సంపాదిస్తుంది అని అనుకుంటున్నారా..? ఈ చిన్నారిపై మీద మొత్తం 11 యూట్యూబ్ ఛానెళ్లు నడుస్తున్నాయి. వీటి నుంచే ఈ మొత్తం ఆదాయం వస్తుంది.

అనస్తాసినా కేవలం బొమ్మలతో ఆడుకుంటూనే ఈ మొత్తాన్ని సంపాదిస్తుంది. అయితే ఆడుకుంటే డబ్బులు ఎలా వస్తాయి అనే సందేహం రావచ్చు. కేవలం బొమ్మలతో ఆడుకోవడం తో పాటు.. తనకు నచ్చిన బొమ్మల గురించి, నచ్చని బొమ్మల గురించి చెప్తుంది. ఒక విధంగ చెప్పాలి అంటే నచ్చిన బొమ్మ ఎందుకు నచ్చింది, నచ్చని బొమ్మ ఎందుకు నచ్చలేదు అని వీడియోలో చెప్తుంది.

ఇలా అనస్తాసినా చేసిన వీడియోలను ఎక్కువ మంది చూస్తున్నారు. మొత్తంగా 11 ఛానెళ్లలో బొమ్మలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుందని అంటుంది. అనస్తాసినా సంపాదన చూసిన చాలా మంది ఔరా అంటున్నారు. అయితే ఒక చిన్నారి అంత పెద్ద మొత్తం సంపాదించడం అనేది సామాన్య విషయం కాదు.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సబ్ స్క్రైబర్లు ఉన్న చిన్నారి యూట్యూబ్ ఛానెల్ అనస్తాసినా దే కావడం విశేషం. దీంతో 2021లో యూట్యూబ్ ఆధారిత వీడియోల నుంచి పెద్ద మొత్తం లో డబ్బు సంపాదించిన చిన్నారిగా అనస్తాసినా నిలిచింది. ఈ చిన్నారికి ఉన్న 11 చానెళ్లలో ముఖ్యమైంది మాత్రం లైక్ నాత్స్యా అనే ఛానెల్. ఈ ఛానెల్ కు ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఎనిమిది కోట్ల అరవై లక్షల మందికి పైగా స్క్రైబర్లు ఉన్నారు.

ఇదిలా ఉంటే అనస్తాసినా పుట్టినప్పుడు తనకు సెరెబ్రల్‌ పాల్సీ అనే వ్యాధి ఉంది. దానిని అదిగమించేందుకు ఆమె అమ్మా నాన్న మొదటగా యూట్యూబ్ ఛానల్‌ ను స్టార్ట్ చేశారు. అలా ఇంతింతై వటుడింతై ప్రస్తుతం యూట్యూబ్ నుంచి ఎక్కువ సంపాదించే వారి జాబితాలో టాప్ టెన్ లో ఉంది.