Begin typing your search above and press return to search.
చిన్నమ్మకు మరో ఎదురుదెబ్బ తప్పలేదు
By: Tupaki Desk | 4 April 2017 4:31 AM GMTఅన్నిసార్లు కాలం ఒకేలా అస్సలు ఉండదు. ఆ విషయం తమిళనాడు చిన్నమ్మ శశికళ ఉదంతాన్ని చూసినోళ్లందరికి ఇట్టే అర్థమవుతుంది. అమ్మ ఉన్నప్పుడు.. లేనప్పుడు చక్రం తిప్పిన చిన్నమ్మకు ఆ మధ్య నుంచి టైం అస్సలు బాగోలేదు. అమ్మ అనారోగ్యం పాలైన నాటి నుంచి పరిస్థితుల్ని తన చేతుల్లోకి తీసుకొని.. తాను అనుకున్నట్లే జరిగేలా ప్లాన్ చేసుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న అంతిమ లక్ష్యానికి అడుగు దూరానికి చేరుకున్నప్పటి నుంచి బ్యాడ్ టైం మొదలైందని చెప్పాలి. పార్టీ అధినేత్రిగా అవతరించేందుకు సైతం సహకారం అందినప్పటికీ.. సీఎం కావాలన్న ఆశను నెరవేర్చుకునే సమయానికి పరిణామాలన్నీ వేగంగా మారిపోవటమే కాదు.. అప్పటినుంచి చిన్నమ్మ అనుకున్నవేమీ పెద్దగా జరగటం లేదని చెప్పాలి.
పళనిస్వామిని సీఎం చేయటం మినహా మిగిలినవేమీ చిన్నమ్మ అనుకున్నట్లేమీ జరగలేదని చెప్పక తప్పదు. అక్రమాస్తుల కేసులో పరప్పన జైలులో శిక్ష పొందుతున్న ఆమె.. తనను కనీసం వీఐపీ ఖైదీగా ట్రీట్ చేయాలన్నా.. నో అనేయటం తెలిసిందే. తాజాగా.. ఆమెను పరప్పన అగ్రహార జైలు నుంచి తమకూరు జైలుకు షిఫ్ట్ చేయాలంటూ పిటీషన్ ఒకటి దాఖలైంది. తమిళనాడు రాజకీయాల్లో కీలకభూమి పోషిస్తున్న శశికళను కలుసుకునేందుకు పలువురు ఆమెను కలుస్తుంటారని.. అందుకే.. ఆమెను పరప్పన అగ్రహర జైలు నుంచి తమకూరు జైలుకు తరలిస్తే బాగుంటుందంటూ రామస్వామి పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సదరు పిటీషన్ ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. చిన్నమ్మ జైలు బదిలీ పిటీషన్ ను కొట్టివేసిన కోర్టు.. రూల్స్ కు తగ్గట్లే శశికళను కలిసే అవకాశం ఉంటుందని..ఎలాంటి మినహాయింపునకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. మరోపక్క అమ్మ మృతితో జరుగుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అమ్మ తరఫు అభ్యర్థి దినకర్ కు గాలి ఏమాత్రం అనుకూలంగా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. చూస్తుంటే.. చిన్నమ్మ టైం కనుచూపు మేర బాగోలేదన్నట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/