Begin typing your search above and press return to search.
ప్లీజ్ మమ్మల్ని అలా పిలవద్దు.. ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిల విన్నపం !
By: Tupaki Desk | 17 March 2020 11:45 AM GMTకరోనా ... చైనాలోని వూహాన్ పట్టణం లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. అప్పటి నుంచి చైనీయులు ఎక్కడ కనిపించినా.. వారిని అంటరాని వాళ్లలా చూస్తూ దూరం పెడుతున్నారు. అయితే చైనాలో మొదలైన కరోనా వ్యాధి .. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు శాపంగా మారింది. వారికి కరోనా లక్షణాలు లేకుండా మన సమాజం నుంచి వివక్షత ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. తమను కరోనా అంటూ పిలవద్దంటూ కొంత మంది విద్యార్థులు ప్రజలను విన్నవించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈశాన్య రాష్ట్రాలు చైనాను ఆనుకొని ఉండటం తో వారంతా చైనీయులను పోలి ఉంటారు. దీని కారణంగా ప్రజలు వారిని చైనా వారిగా అనుమానిస్తున్నారు. దీంతో తాము చదువుకునే ప్రాంతాల్లో, పని చేసే ప్రాంతాల్లో ఉండటానికి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదట. అంతటి తో ఆగకుండా వారిని కరోనా.. కరోనా అంటూ కొంత మంది పిలుస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఈ వీడియోలో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా పంజాబ్ రాష్ట్రంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపేందుకు ఇలా ఆ విద్యార్థులు అంతా కలిసి ఒక వీడియోలో తమ ఆవేదన పంచుకున్నారు. చైనీయులుగా ఉన్నామంటూ తమను దూరం పెడుతున్నారని, స్నేహితులు కూడా తమను దగ్గరకు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా చైనా వాళ్లం కాదని.. తమపై వివక్ష చూపొద్దంటూ వాపోయారు. మేం స్వచ్ఛమైన భారతీయులం. మమ్మల్ని చైనీయులుగా భావించకండి అంటూ వారి అవేదన తెలియజేసారు.