Begin typing your search above and press return to search.
నియంత ప్లెజర్ స్వ్రాడ్ గురించి విన్నారా?
By: Tupaki Desk | 2 May 2016 5:07 PM GMTతన లాంటి హెయిర్ స్టైల్ ను దేశ ప్రజలు ఫాలో కావాలని.. తన భార్య స్టైల్ మాదిరే దేశంలోని మహిళలు ఫాలో కావాలని ఫర్మానా జారీ చేయటం.. అమెరికా మీద అంతెత్తు ఎగిరిపడటం.. అణ్వస్త్ర ఆయుధాల పేరు చెప్పి అవాకులు చవాకులు పేలే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ గురించి తెలియని వారు ఉండరు. ఆరాచకానికి పరాకాష్ఠ అన్నట్లుగా వ్యవహరించే ఇతగాడి లీలలు వింటే.. నరరూప రాక్షసులుగా చెప్పుకునే ఇస్లామిక్ తీవ్రవాదులు గుర్తుకు రాక మానదు.
ఇలాంటి వారి గురించి విన్నప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో ఆయా దేశాల్లో బతుకుతున్న ప్రజలు ఎంత దురదృష్టవంతులనిపించక మానదు. అంతేకాదు.. చచ్చిన తర్వాత నరకం ఎలా ఉంటుందో కానీ.. బతికి ఉండగానే నరకానికి మించినట్లుగా ఉంటాయనిపిస్తుంది. ఇటీవల ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. తన తాతల నాటి నుంచి అమలవుతూ.. ఆ మధ్యన బ్రేకులు పడిన ప్లెజర్ స్వ్రాడ్ ను పునరుద్ధరించినట్లుగా పేర్కొన్నారు. పేరులో ప్లెజర్ ఉండే ఈ స్వ్రాడ్ ఏంటన్న ఆసక్తి కలగక మానదు. కానీ.. దీని గురించి తెలిస్తే గొంతు తడారిపోతుంది? వామ్మో ఇంత దారుణమా? అనిపించక మానదు. ఈ స్వ్రాడ్ కోసం ఎంపిక చేసిన కుటుంబాలు పడే వేదన ఎంతన్నది ఆలోచిస్తేనే కంటి వెంట నీరు కారటం ఖాయం.
పేరు చూసినప్పుడు ప్లెజర్ గా అనిపించే ఈ స్ర్వ్రాడ్ నరకానికి నకళ్లు. నియంతతో పాటు.. నియంత అనుచరులు.. ముఖ్య సైనిక నాయకులకు సుఖాలు అందించటమే ఈ స్వ్రాడ్ పని. ఇందులో పని చేసే అమ్మాయిల్ని 13 ఏళ్ల వయసులోనే తీసుకొచ్చేస్తారు. ఈ స్వ్రాడ్ కోసం ఎంపిక చేసిన పక్షంలో.. వారి తల్లిదండ్రుల అనుమతులు ఏమీ ఉండవు. వారిని అలా తీసుకొచ్చేస్తారు. ఈ స్వ్రాడ్ కోసం స్కూల్ నుంచి రెండు వేల మంది టీనేజ్ బాలికల్ని ఎంపిక చేస్తారు.
ఇందులో ఎంపికయ్యే అమ్మాయిలు చాలా అందంగా ఉండాలి. వారి ముఖాల మీద ఎలాంటి మచ్చలు కానీ లోపాలు కానీ ఉండకూడదు. అన్నింటికంటే ముఖ్యం వారు శీలవంతులై ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. అంతేకాదు.. ఎంపిక సమయంలో జన్యుపరంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది కూడా చెక్ చేస్తారు.
ఇలా రకరకాల వడపోతల తర్వాత రెండు వేల మంది టీనేజర్లను మూడు విభాగాల కోసం ఎంపిక చేస్తారు. వీరిలో ఒక బ్యాచ్ కేవలం మసాజ్ లు చేయటం కోసమే ఎంపిక చేస్తారు. వీరిని ఆరు నెలల పాటు హాంకాంగ్ లో మసాజ్ శిక్షణ కోసం పంపుతారు. మరో బ్యాచ్ ను కేవలం సెక్స్ అవసరాలు తీర్చటం కోసమే వినియోగిస్తారు. మరో బ్యాచ్ ను సంగీతం.. నృత్యం కోసం ఎంపిక చేస్తారు. వీరిని ఎంపిక చేసినప్పుడు ప్రభుత్వ ప్రాజెక్టు కోసమని తీసుకెళతారు. ఇలా తీసుకెళ్లిన వారిని మళ్లీ వారి జీవితంలో వారి తల్లిదండ్రుల వద్దకు పంపరు. కలవనీయరు కూడా.
ఇక.. స్వ్రాడ్ కోసం ఎంపిక చేసిన అమ్మాయిలకు స్వేచ్ఛ అన్నది ఉండదు. ఎవరితోనూ మాట్లాడటానికి వీలు ఉండదు. సెక్స్ సేవలు అందించే బ్యాచ్ కి తప్ప మిగిలిన రెండు బ్యాచ్ లకు తరచూ శీల పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ లెక్క తేడా వస్తే.. శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇలా పని చేసే అమ్మాయిలకు నాలుగు వేల డాలర్ల చొప్పున వేతనం ఇస్తుంటారు. ఈ నరకం నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన వారి కారణంగా కిమ్ తాతల కాలం నుంచి సాగుతున్న ఈ దురాగతం గురించి ప్రపంచానికి వెల్లడైంది. కిమ్ జాంగ్ తాత కాలం నుంచి ఈ దారుణం సాగుతోంది. 2011లో కిమ్ తండ్రి చనిపోయిన తర్వాత మూడేళ్ల పాటు వీటి సేవల్ని నిలిపివేశారు. తాజాగా మళ్లీ ఈ సేవల్ని షురూ చేశారు. ఇంతటికంటే దారుణం ఇంకేం ఉంటుంది?