Begin typing your search above and press return to search.
మోదీ డబ్బా కొట్టుకునే స్కీంకు డబ్బులు లేవు!
By: Tupaki Desk | 27 Sep 2019 5:33 AM GMTప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)...ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటి. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి 6.5 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో గృహ రుణాలను మంజూరు చేయాలన్నది పీఎంఏవై లక్ష్యం. సంవత్సరాదాయం రూ.3 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉన్న వారికి ఈ రుణాలను మంజూరు చేస్తారు. అయితే బ్యాంకులు సబ్సిడీని ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి వెల్లువెతుతున్నాయి.
ఓ టీవీ ఛానల్ మాచార హక్కు చట్టం కింద కేంద్ర గృహ వసతి - పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి సేకరించిన వివరాల్లో ఆసక్తికర అంశాలున్నాయి. అందరికీ గృహ వసతి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం నిధుల కొరతతో కునారిల్లుతున్నది. బ్యాంకులు - రుణ మంజూరు సంస్థల నిర్లిప్తత కారణంగా పీఎంఏవై పథకం నత్తనడకన సాగుతున్నదని ప్రభుత్వ వర్గాలే వెల్లడిస్తున్నాయి.ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మందికి గృహ వసతి కల్పించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా - ఒక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్ హెచ్ బీ) వద్దే ఇంకా 1.57 లక్షల మంది లబ్ధిదారుల క్లెయిమ్ లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటివరకు 6.43 లక్షల మంది లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.14,482 కోట్లు విడుదల చేశామని ఎన్ హెచ్ బీ తెలిపింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీములో భాగంగా...రూ.3 లక్షల దాకా రుణాన్ని మంజూరు చేస్తారు. ఏడాదికి రూ.3 లక్షల్లోపు ఆదాయాన్ని ఆర్జించేవారు ఆర్థికంగా వెనకబడిన తరగతుల పరిధిలోకి వస్తారు. వీరికి సుమారు 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు కొనుక్కోవచ్చు లేదా కట్టుకోవచ్చు. ఈ రుణం తీసుకోవడానికి పారిశుద్ధ్య కార్మికులు - చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగులు - ప్రైవేటు టీచర్లు - హోంగార్డులు వంటివారు అర్హులు. నోడల్ ఏజెన్సీలుగా నేషనల్ హౌసింగ్ ఆఫ్ బ్యాంకింగ్ - హడ్కోలు వ్యవహరిస్తున్నాయి. దాదాపు ముప్పయ్ కి పైగా ప్రభుత్వ - ప్రైవేటు బ్యాంకులు పీఎంఏవై స్కీము కింద రుణాన్ని మంజూరు చేయడానికి ముందుకొచ్చాయి. అయితే, అమలులో మాత్రం ఇలా విభిన్నంగా జరుగుతోంది.