Begin typing your search above and press return to search.
కేంద్రానికి టాటా రూ.1500 కోట్ల విరాళం..అనుమానం వ్యక్తం చేస్తున్న థరూర్!
By: Tupaki Desk | 31 March 2020 6:38 AM GMTకరోనా వైరస్ ను దేశంలో అరికట్టాలని ..కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. దీనికి కేంద్రానికి , రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ భారీగా నిధులు అవసరమవుతాయి. దీనితో సామజిక భాద్యత తో ఎంతోమంది కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు దేశంలోని బడాబాబులు , సినీ స్టార్స్ , ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
వ్యాపారంలో సేవాభావాన్ని కూడా రంగరించే టాటా కంపెనీ.. మొత్తంగా రూ.1500 కోట్ల సాయాన్ని అందించగా, దేశంలోనే అపరకుబేరుడైన ముఖేశ్ అంబానీ తన రిలయన్స్ సంస్థల ద్వారా పీఎం-కేర్స్ సహాయనిధికి రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అలాగే గుజరాత్ , మహారాష్ట్ర ప్రభుత్వాలకి చెరో రూ.5 కోట్ల సాయాన్ని రిలయన్స్ ప్రకటించింది. అంబానీల సొంత రాష్ట్రం గుజరాత్. కరోనాపై పోరులో కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రిలయన్స్ సంస్థ అన్ని వేళలా, అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని సంస్థ సీఈవో ముఖేశ్ అంబానీ తెలిపారు.
అలాగే ఈ విరాళం ప్రకటించడానికి ముందే రిలయన్స్ ఆధ్వర్యంలో ముంబైలో ప్రత్యేకంగా కరోనా ఆస్పత్రి నిర్మించబోతున్నట్లు ముఖేశ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ముంబై మహానగర పాలిక, సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా 15 రోజుల్లోనే ఈ 100 పడకల వసతిని ఏర్పాటు చేసింది. కరోనా చికిత్సకు కావాల్సిన అన్ని ఆధునిక వసతులను అందులో ఏర్పాటు చేశారు.
అయితే, కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వానికి సాయం చేయాలను కునేవాళ్లు డబ్బులు పంపడానికి వీలుగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వ్యవస్థను తెరపైకి తీసుకురావడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపట్టింది. విపత్తుల సమయంలో రాష్ట్రాల్లోనైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి, కేంద్రానికైతే ప్రధానమంత్రి సహాయనిధి కు ప్రజలు విరాళాలు పంపడం తెలిసిందే. కానీ కరోనా దగ్గరికొచ్చేసరికి కొత్తగా ‘పీఎమ్- కేర్స్ ఫండ్' అనే ట్రస్టును ఎందుకు సృష్టించచారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు. ప్రధాని పేరుతో ఛారిటబుల్ ట్రస్టు పెట్టి విరాళాలు సేకరిస్తున్న ప్రక్రియ సజావుగా సాగినట్లు కనిపించడంలేదని, దీనిపై పీఎంను కూడా ప్రశ్నించానని కాంగ్రెస్ ఎంపీ థరూర్ తెలిపారు. కరోనా విరాళాల సేకరణ కోసం ఏర్పాటైన ‘పీఎం కేర్స్ ఫండ్' ట్రస్టుకు ప్రధాని మోదీ చైర్మన్ గా ఉన్నారు. కేంద్రం మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు.