Begin typing your search above and press return to search.

పీఎం కేర్స్‌కు ‌నిధులు ఎవ‌రెన్ని ఇచ్చారో..

By:  Tupaki Desk   |   19 May 2020 4:00 AM GMT
పీఎం కేర్స్‌కు ‌నిధులు ఎవ‌రెన్ని ఇచ్చారో..
X
మ‌హ‌మ్మారి రావ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఆర్థిక‌, వాణిజ్య కార్య‌క‌లాపాలు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కు ప‌రిమిత‌మయ్యారు. ఈ స‌మ‌యంలో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త ప్ర‌భుత్వం నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈక్ర‌మంలోనే పేద‌ల‌ను ఆదుకునేందుకు పీఎం కేర్ ఫండ్ అనే పేరుతో విరాళాలు సేక‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ వ్యాపార‌వేత్త‌, అపార కుబేరుడు విప్రో అజీమ్ ప్రేమ్‌జీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.అయితే కొందరు కంపెనీ తరఫున, మరి కొంత మంది వ్యక్తిగతంగా, ఇంకొంత మంది తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిధులు ఇచ్చారని తెలిసింది. ఫోర్బ్స్ టాప్ 10 ప్రయివేటు విరాళాలలో అజీమ్ ప్రేమ్‌జీది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విరాళంగా నిల‌వ‌డం విశేషం.

మూడో అతిపెద్ద విరాళం కరోనాపై పోరుకు విరాళంగా ఇచ్చిన అజిమ్ ప్రేమ్‌జీని దేశవ్యాప్తంగా ప్ర‌శంసలు కురుస్తున్నాయి. ప్రేమ్‌జీ రూ.1,125 (132 మిలియన్లు) కోట్లు ప్రకటించారు. క‌రోనా బాధితుల‌కు వైద్యం అందిస్తున్న సిబ్బందికి సహాయం కోసం ఈ మొత్తం ప్రకటించారు. ఈ మొత్తంలో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లు, విప్రో రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ రూ.25 కోట్లు ఇచ్చింది. క‌రోనా భృతి ఆడుతుంటాడు. ప్రేమ్ జీ అత‌డి జీవితంలో1 బిలియన్ డాలర్లు (రూ.7,549 కోట్లు) ఇచ్చారు. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, మిలిందా గేట్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం. వారిద్ద‌రిది క‌లిపి మొత్తం 255 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,925 కోట్లు) విరాళం వ‌చ్చింది.

- 4వ స్థానం సోరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ ఫౌండర్ జార్జ్ సోరోస్ 130 మిలియన్ డాలర్లు విరాళం
- 5వ స్థానంలో ఫోర్ట్‌స్కూ మెటల్స్ స్టాండ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆండ్రూ ఫారెస్ట్ (500 మిలియన్ డాలర్లు)
- 6వ స్థానంలో స్కోల్ ఫౌండర్ అండ్ చైర్మన్ జెఫ్ స్కోల్ (100 మిలియన్ డాలర్లు)
- 7వ స్థానంలో అమెజాన్ సీఈఓ అండ్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (100 మిలియన్ డాలర్లు)
- 8వ స్థానంలో డెల్ ఫౌండర్ అండ్ సీఈవో మైఖేల్ డెల్ (100 మిలియన్ డాలర్లు)
- 9వ స్థానంలోబ్లూమ్‌బర్గ్ ఎల్పీ ఓనర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ 74.5 మిలియన్ డాలర్లు
- శాంసన్ ఎనర్జీ నుంచి లిన్ అండ్ స్టాసీలు (70 మిలియన్ డాలర్లు)తో 10వ స్థానంలో నిలిచారు.
- ముఖేష్ అంబానీ భారీ విరాళం ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ రూ.500 కోట్లు (67 మిలియన్లు) పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చారు.
-రూ.5 కోట్ల చొప్పున మహారాష్ట్ర, గుజరాత్‌లకు... ఈ రెండు రాష్ట్రాలకు రూ.10 కోట్లు ఇచ్చారు. 100 బెడ్స్‌తో ముంబైలో అత్యాధునిక కరోనా హాస్పిటల్ నిర్మించారు.
- టాటా సన్స్ అధినేత రతన్ టాటా రూ.500 కోట్లు (67 మిలియన్ డాలర్లు) విరాళం
- టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కంపెనీ తరఫున రూ.1,000 కోట్లు (134 మిలియన్ డాలర్లు) కరోనాపై పోరుకు విరాళం ఇచ్చారు. టాటా గ్రూప్ వెంటిలెటర్లు తయారు చేస్తామని కూడా ప్రకటించింది.
- కోట్లాది రూపాయల విరాళాలు మ్యాన్‌కైండ్ ఫార్మా అధినేత రమేశ్‌ జునేజా రూ.51 కోట్లు (7 మిలియన్ డాలర్లు)
- టీవీఎస్ మోటార్స్ రూ.25 కోట్లు (3.3 మిలియన్ డాలర్లు)
- ఉదయ్ కొటక్ రూ.25 కోట్లు
- కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.35 కోట్లు
- ఏషియన్ పేయింట్స్ రూ.35 కోట్లు
- బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ రూ.25 కోట్లు
- బీసీసీఐ రూ.50 కోట్లు