Begin typing your search above and press return to search.

రాఫెల్ విషయంలో మోడీ అడ్డంగా బుక్కయ్యారు?

By:  Tupaki Desk   |   8 Feb 2019 10:00 AM GMT
రాఫెల్ విషయంలో మోడీ అడ్డంగా బుక్కయ్యారు?
X
రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం వ్యవహరంలో మోడీని వదిలిపెట్టేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఓ ప్రముఖ ఆంగ్ల ప్రతిక రాఫెల్ కొనుగోలు విషయంలో బయటపెట్టిన విషయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ కుంభకోణంలో తాను చేస్తున్న ఆరోపణలు అసత్యమని కొట్టిపారేసే మోడీ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. దేశానికి వ్యాచ్ మ్యాన్ అని చెప్పుకునే వ్యక్తి దొంగగా దొరికిపోయారని ప్రజల ముందు నిలుచుకున్నారని విమర్శించారు. అదే సమయంలో ఆంగ్లపత్రిక చేసి ఇన్విస్టిగేషన్ ను ఆయన అభినందించారు.

పక్కా ఆధారాలతో ఆంగ్లప్రతిక రాఫెల్ కుంభకోణాన్ని బయటపెట్టిందని రాహుల్ అన్నారు. ఫ్రాన్స్ తో ప్రభుత్వం చర్చలు జరుపుతుండగానే మరోపక్క ప్రధాని కార్యాలయం అడ్డదారిలో చర్చలు జరిపిందనే విషయాన్ని పత్రిక వెల్లడించిందని తెలిపారు. ప్రభుత్వం చర్చిస్తుండగా మోడీ మరొకరితో ఎందుకు చర్చలు జరుపాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ కేవలం తన స్నేహితుడు అనిల్ అంబానీ కోసమే చర్చలు జరిపారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. దీంతో దేశానికి కాపలా ఉంటానని చెప్పిన వ్యక్తే దొంగలా మారినట్లు స్పష్టమవుతుందని విమర్శించారు.

కాగా రాహుల్ ఆరోపణలపై మోడీ గురువారం లోక్ సభలో మండిపడ్డారు. కాంగ్రెస్ రాఫెల్ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ బలోపేతం కావడం ఇష్టంలేకనే ఇలాంటి ఆరోపణలను పదేపదే చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రక్షణ విషయంలో ఒక్క ఒప్పందం కూడా జరుగలేదని అందుకే ఎన్డీఏ హయాంలోనూ ఒప్పందాలు చేసుకోకుండా అడ్డుపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి రాఫెల్ విషయంలో ఇచ్చిన క్లీన్ చీట్ ప్రశ్నార్థకంగా మారిందని రాహుల్ గాంధీ అన్నారు. ఏదిఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో్ రాఫెల్ కుంభకోణం మరోసారి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మస్త్రంగా మారుతుంది. రాఫెల్ వివాదం నుంచి లబ్ధిపొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ అవకాశం ఎంతవరకు కలిసివస్తుందో వేచి చూడాల్సిందే మరీ..