Begin typing your search above and press return to search.
పార్లమెంట్లో 18 ఏళ్ల రికార్డ్..మోడీ దీక్ష
By: Tupaki Desk | 10 April 2018 2:06 PM GMTభారత పార్లమెంట్ తాజా సమావేశాలు అనూహ్య రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్లలో తొలిసారి దాదాపు పూర్తిగా సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉభయసభల్లోనూ ఈసారి 250 పనిగంటలు వృథా అయ్యాయి. రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ముగియడంతో పార్లమెంట్ శుక్రవారం నుంచి నిరవధికంగా వాయిదా పడింది. గతనెల 5వ తేదీ నుంచి ప్రారంభమైన మలి దశ బడ్జెట్ సమావేశాలు ఆద్యంతం వాయిదాల మధ్యే కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కు ప్రతిపక్షాలు పదేపదే అడ్డు తగిలినందుకు నిరసనగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి మోడీ ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించడం గమనార్హం.
ఈ నెల 12న గురువారం కర్ణాటకలో ప్రధాని మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అందరూ బీజేపీ ఎంపీలు ఈ నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. దళితులపై దాడికి నిరసనగా రాజ్‌ఘాట్ దగ్గర కాంగ్రెస్ చేసిన నిరాహార దీక్షకు కౌంటర్‌గా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. నిరాహార దీక్ష ఐడియా ప్రధాని మోడీదేనని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకపోవడం వల్ల ప్రజలకు ఎంత నష్టం జరిగిందో తమకు తెలుసని చెప్పే ప్రయత్నంలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అందుకే ఆ 23 రోజుల జీతాలను తీసుకోవడానికి కూడా ఎన్డీయే ఎంపీలంతా నిరాకరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
ఇదిలాఉండగా...మొత్తం 29 రోజుల్లో 22రోజులపాటు పార్లమెంట్ సమావేశమైంది. వివిధ పార్టీల నిరసనలు, ఆందోళనలు, అంతరాయాల మధ్య ఉభయసభల్లో సుమారు 250 పనిగంటలు వృథా అయ్యాయి. లోక్‌సభలో 127 గంటల 45 నిమిషాలు, రాజ్యసభలో 121 గంటలపాటు సభాకార్యక్రమాలు స్తంభించాయి. 2000 తర్వాత అతితక్కువగా చర్చలు జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఇవే కావడం గమనార్హం. రెండోదశ బడ్జెట్ సమావేశాలో లోక్‌సభ 4శాతం, రాజ్యసభ 8శాతం సమయంపాటు చర్చించింది. బడ్జెట్ సమావేశాల మొత్తంగా (తొలి, మలి దశల్లో) చూస్తే.. లోక్‌సభ 23శాతం, రాజ్యసభ 28శాతం ఫలితాలనందించింది అని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్ వెల్లడించారు. ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మాన నోటీసులను విపక్షాలు అందజేసినా - లోక్ సభలో వాటిని చర్చకు అనుమతించలేదు. దీంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా - కావేరీ జలనిర్వహణ బోర్డు - పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం - రిజర్వేషన్ల పెంపు - విగ్రహాల ధ్వంసం - ఎస్సీ - ఎస్టీ చట్టంలోని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు తీర్పు - యూపీలోని కాస్‌గంజ్ అల్లర్లు వంటివి ఈ దఫా పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళనలకు కారణమయ్యాయి. సభ సాగకుండా మోకాలడ్డుతున్నారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ఆందోళనకు దిగిన ఎంపీలనుద్దేశించి పేర్కొనగా, జాతిప్రయోజనాలను గుర్తెరిగి మసులుకోవాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ పలుమార్లు వ్యాఖ్యానించారు. మలిదశ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ 29రోజులు సమావేశమైంది. అయితే కేవలం 34 గంటల 5 నిమిషాలపాటు మాత్రమే సభ సాగింది. ఇందులో రాష్ట్రపతి ప్రసంగంపై 10 గంటల 43నిమిషాలపాటు - బడ్జెట్ పై 12గంటల 13నిమిషాలపాటు చర్చ జరిగింది. మొత్తంగా 127 గంటల 45నిమిషాలపాటు సభలో అంతరాయాలు కొనసాగాయి. 9గంటల 45నిమిషాల సభాసమయాన్ని అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలకు మళ్లించాల్సి వచ్చింది అని స్పీకర్ మహాజన్ ప్రకటించారు.
లోక్ సభలో సభ్యులడిగిన మొత్తం 580 ప్రధాన ప్రశ్నలకు కేవలం 17కు మాత్రమే ప్రభుత్వం సభలో సమాధానమిచ్చింది. అంటే రోజుకు సగటున రెండురోజులకు ఒక సమాధానం లభించింది. 6670 ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానమివ్వాల్సి ఉంది. ఇక రాజ్యసభలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. రెండోదశ బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 30సార్లు సమావేశమైంది. 44గంటలపాటు సభ కొనసాగింది. అందులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ 14గంటలపాటు, బడ్జెట్‌పై 10గంటలపాటు చర్చ సాగింది. 121 గంటల సభాసమయం వృథా అయ్యింది. 27రోజులపాటు సభ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టలేకపోయింది అని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఎగువసభలో సభ్యులడిగిన 419 ప్రశ్నలకు ఐదింటికి మాత్రమే మంత్రులు మౌఖికంగా సమాధానమిచ్చారు. దేశ అత్యున్నత చట్టసభలో ఈ తరహా పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచివి కావని వెంకయ్య ఆవేదన వ్యక్తంచేశారు. కీలకమైన ఆర్థిక బిల్లు-2018తోపాటు ఐదు బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. గ్రాట్యుటీ సవరణ బిల్లు-2017 - స్పెసిఫిక్ రిలీఫ్ సవరణ బిల్లు-2017 వంటివి ఇందులో ఉన్నాయి. ఇక ఈ సెషన్‌లో ఐదు కొత్త బిల్లులు లోక్‌సభ ముందుకు వచ్చాయి. అంతరాయాల కారణంగా కీలకమైన ఆర్థిక బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగలేదు.