Begin typing your search above and press return to search.
క్షమాపణలు చెప్పిన మోడీ.. ఎందుకలా చేసినట్లు?
By: Tupaki Desk | 29 March 2020 7:53 AM GMTరాజకీయ నేతల డీఎన్ లో ఉండే రాజకీయాన్ని కరోనా సైతం ప్రభావితం చేయలేదేమో? ఎలాంటి పరిస్థతులు ఉన్నా.. తమకు మైలేజీ వచ్చే ఈ చిన్న అవకాశాన్ని వదులుకోని తెలివైన అధినేతలు కొందరు కనిపిస్తుంటారు. అలాంటి వారి విషయంలో ప్రధాని మోడీ ముందుంటారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ చెబుతుంటారు. దీనికి తగ్గట్లే కొన్నిసమయాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు అలానే ఉంటుందన్న విమర్శ వినిపిస్తోంది. లాక్ డౌన్ అన్నది ప్రత్యేక సందర్భం. ప్రపంచంలో చాలా దేశాలు చేశాయి.
మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ కాస్త ముందే మేల్కొందని చెప్పాలి. అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని చూస్తే.. మన దేశానికి పొంచి ఉన్న ముప్పు ఎంతో అర్థమవుతుంది. ఈ కారణంతోనే.. అత్యంత కఠినమైన రీతిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14 వరకూ సాగే ఈ లాక్ డౌన్ రానున్న రోజుల్లో మరింత పొడిగించినా ఆశ్చర్యపోవాల్సిన అసవరం లేదంటున్నారు.
తాజాగా మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ అవసరాన్ని ప్రస్తావిస్తూ.. దేశ ప్రజల్ని రక్షించేందుకు తాము తీసుకున్న చర్యల్ని ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తాను తీసుకున్న నిర్ణయం కారణమని చెబుతూ.. క్షమాపణలు కోరారు. ఇలాంటి భావోద్వేగాల్ని ప్రజల్లో పెంచటంలో మోడీ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లోకీలకమైనవి చూస్తే..
% మహమ్మారి కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను రక్షించడం కోసమే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు. ప్రజలు సంయమనంతో ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
% దినసరి కూలీలు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకుంటున్నా.ప్రపంచ పరిస్థితులు చూశాకే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇది జీవన్మరణ పోరాటం. రోగం వచ్చినప్పుడే చికిత్స చేయాలి, లేదంటే ఇబ్బందులొస్తాయి.
% కరోనో ఒక ప్రాంతానికే చెందిన కాదు. ప్రపంచం నలుమూలలా వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాము. దీని వల్లన ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలను నన్ను క్షమించండి.
% మీ రక్షల కోసమే లాక్‌డౌన్ విధించాము. కొందరు ఇంకా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడంలేదు. అన్నింటికన్నా.. దేశ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. వారి అనుభవాలను తెలుసుకుంటున్నాను.
% కరోనాతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. ఇది నివారించదగ్గ వ్యాధి. లాక్‌డౌన్‌లో పాల్గొనడమంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే. వైరస్‌ను అరికట్టడానికి లాక్‌డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయం. లక్ష్మణ రేఖను అందరూ పాటించాల్సిందే.
% కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగటం కొంత ఆందోళనకరమే. దీనివల్లన అభివృద్ధి చెందిన దేశాలు కూడా కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. మానవత్వంతో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా వందనాలు. సేవాభావంతో రోగికి చికిత్స చేసే వైద్యులు ఎంతో గొప్పవారని ఆచార్య చరకుడు ఎప్పుడో చెప్పారు. వైద్యులందరికీ నా ధన్యవాదాలు. వారు అందిస్తున్న సేవలు మరువలేనివి.
% కరోనా మానవత్వానికి సవాల్ విసురుతోంది. కరోనాపై గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. అందరూ ఏకమై కరోనాపై యుద్ధం చేయాలి. ప్రభుత్వ నిబంధనలు, స్వీయ నియంత్రణ పాటించాల్సిదే. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలి.