Begin typing your search above and press return to search.
‘గోరక్ష’పై మోడీ షాకింగ్ మాటలు విన్నారా?
By: Tupaki Desk | 7 Aug 2016 5:25 AM GMTసంఘ్ భావజాలం పేరిట కొందరు చేస్తున్న ‘అతి’పై ప్రధాని మోడీ ఆగ్రహంగా ఉన్నారా? గోరక్ష పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారి కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్న ఆందోళనలో ఉన్నారా? గోరక్ష పేరుతో చేస్తున్న అతివాదులపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఇక ఊరుకోకూడదని భావిస్తున్నారా? అంటే అవుననే చెప్పాలి. గోరక్ష పేరుతో చోటు చేసుకుంటున్న హింసాత్మక కార్యక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటంతో పాటు.. అందరికి ఆమోదయోగ్యం కాని సర్కారుగా మోడీ ప్రొజెక్ట్ అవుతున్న తీరు ఆయనలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లుగా మోడీ తాజా మాటలు చూస్తే అర్థమవుతుందని చెప్పాలి.
తొలిసారి టౌన్ హాల్ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోడీ.. ఎంపిక చేసిన 2 వేల మందిలో తొమ్మిది మందికి ప్రశ్నించే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా గోరక్ష పేరుతో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు తన ఆమోదం లేదన్న విషయాన్ని తేల్చి చెప్పటమే కాదు.. గోవుల్ని రక్షించటం అంటే.. హింసకు దిగటం కాదని.. గోవుల పట్ల నిజమైన ప్రేమ ఉండేవారు ఏం చేస్తారో తెలుసా? అంటూ మోడీ చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. గోరక్ష పేరుతో గడిచిన రెండేళ్లలో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. అప్పుడెప్పుడో ఇంతలా రియాక్ట్ కాని మోడీ.. తాజాగా మాత్రం స్పందించటం చూసినప్పుడు.. గోరక్ష పేరుతో జరుగుతున్న చేష్టలు తన సర్కారుకు చెడ్డపేరును తీసుకురావటంతో పాటు రాజకీయంగా నష్టం జరుగుతుందన్నఆలోచనలో మోడీ ఉన్నట్లు స్పష్టమవుతున్నట్లు చెప్పక తప్పదు.
గోరక్ష పేరుతో ఇప్పుడు కొంతమంది దుకాణాలు తెరిచి కూర్చున్నారని.. వారిని చూస్తే తనకు ఎంతో కోపం వస్తుందని మోడీ చెప్పారు. గోభక్తులు వేరు.. గో రక్షకులు వేరంటూ ఆయన పురాణాల్ని ప్రస్తావించారు. ‘‘పురాణాల్లో రాజుల మధ్య యుద్ధం జరిగినప్పుడు తొలుత ఆవును పెట్టేవారు. బాణం దెబ్బ తగిలి ఆవు చనిపోతే పాపం వస్తుందని యుద్ధంనుంచి వెనక్కు వెళ్లే వారు. నేను కొందరు వ్యక్తులను చూశాను. రాత్రంతా సంఘ వ్యతిరేక పనులు చేస్తారు. కానీ..తెల్లారేసరికి మాత్రం గోరక్షక్ వేషాలు వస్తుంటారు. ఇలాంటి వారిపై సరిగ్గా దృష్టి పెడితే వారి ఘోరాలు బయటకు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాను’’ అని వ్యాఖ్యానించారు.
గోరక్షక్ అంటూ మాటలు చెప్పేవారంతా తమకు తాము రక్షించుకోవటానికి మాత్రమే వేషాలు వేస్తారని.. నిజాంగా వారు గోరక్షకులైతే గౌరవిస్తానని చెప్పిన మోడీ.. ‘‘నిజంగా ఎంతమంది ఆ పని చేస్తున్నారు?’’ అంటూ సూటిగా ప్రశ్నించటం చూస్తే.. గోరక్ష పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు తన ఆమోదం లేదని.. అలాంటి వాటి పట్ల తాను వ్యతిరేకమన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.
తాను గుజరాత్ లో ఉన్నప్పుడు ఒక హెల్త్ క్యాంపులో ఒక ఆవుకు ఆపరేషన్ చేసినప్పుడు దాని కడుపులో నుంచి రెండు బకెట్ల ప్లాస్టిక్ బయటకు వచ్చిందని.. సమాజ సేవ చేసే వారు గోవులు ప్లాస్టిక్ తినకుండా చేసినా అదే పెద్ద గోసేవ చేస్తుందని చెప్పుకొచ్చారు. గోరక్షక్ పేరుతో గోవుల్ని ఏదో చేస్తున్నారంటూ విరుచుకుపడటం.. దాడులు చేయటం మానేసి.. గోవులు ప్లాస్టిక్ తినకుండా చూడండి ముందన్నట్లుగా మోడీ మాటలు చెప్పినట్లు అనిపించట్లేదు..?