Begin typing your search above and press return to search.

మోడీ ముందు ట్రంప్ ఎంత బాస్‌!

By:  Tupaki Desk   |   13 April 2017 1:34 PM GMT
మోడీ ముందు ట్రంప్ ఎంత బాస్‌!
X
త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటూ క‌య్యానికి కాలు దువ్వ‌డంలో మొద‌ట ఉండే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కంటే మన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సూప‌రో సూప‌రా? ఏంటి నిజ‌మే అంటున్నారా? అవును నిజ‌మే. అమెరికా అధ్యక్షుడిపై మన ప్రధాని ఎలా పైచేయి సాధించారనేగా మీ అనుమానం. ఇన్ స్టాగ్రాంలో ట్రంప్ కు ఉన్న ఫాలోవ‌ర్లకంటే మోడీకున్న ఫాలోయర్ల సంఖ్య చాలా ఎక్కువ. ప్రపంచ దేశాధినేతల్లో అత్యధిక ఫాలోవ‌ర్లు ఉన్న లీడర్ గా మోడీ ఆవిర్భవించారు.

6.9 మిలియన్ల ఫాలోవ‌ర్లున్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తో మోడీ ప్రపంచ దేశాధినేతలందరినీ వెనక్కు నెట్టేసి అగ్రస్థానంలో దూసుకుపోతుండడం విశేషం. మోడీ తర్వాత స్థానంలో ట్రంప్ నిలిచారు. ట్రంప్ కున్న ఫాలోవ‌ర్ల సంఖ్య జస్ట్ 6.3 మిలియన్లు మాత్రమే. ఫోటో షేరింగ్ ప్లాట్ ఫామ్ గా ఉన్న ఇన్ స్టాగ్రాంలో కూడా మోడీ హవా వీస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకూ మోడీ ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసినవి కేవలం 101 పోస్టులు మాత్రమే కావడం ఇక్కడ హైలైట్. వర‌ల్డ్ లీడర్స్ ఆన్ ఇన్ స్టాగ్రాం పేరుతో ప్రపంచంలోని 325మంది నేతలు, ప్రభుత్వాధినేతల ఇన్ స్టాగ్రాం అకౌంట్లు పరిశీలించిన గ్లోబల్ స్టడీ ఈ సంగతిని తేల్చింది. మొత్తానికి ఫేస్ బుక్ అయినా, ట్విట్టర్ అయినా, ఎలాంటి సోషల్ నెట్ వర్క్ అయినా మోడీ తర్వాతే ఎవరైనా అని మరోమారు తేలిపోయింది.

కాగా, 125కోట్ల మంది భారతీయుల కోసం పనిచేయడంలో ఎంతమాత్రం మానసిక ఒత్తిడి లేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉండే మోడీ తన అభిమానులు చేసే ట్వీట్లకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తుంటారు. నీతూగార్గ్ అనే మహిళ మోడీని ట్విట్టర్లో ఫాలో అవుతూ మోడీ దినచర్యను పోస్ట్ చేశారు. ప్రధాని బిజీ సెడ్యూల్ ఎప్పుడైనా గమనించారా అని ట్వీట్ చేసిన నీతూ గార్గ్, మమతా బెనర్జీతో భేటీ, ఆస్ట్రేలియా ప్రధానితో బేటీ, స్వచ్ఛభారత్ కార్యక్రమం, అర్థరాత్రి వరకూ ఎన్డీయే కూటమి భేటీలో పాల్గొన్న మోడీ అంటూ పోస్ట్ చేసిన మోడీ బిజీ సెడ్యూల్ పై స్పందించిన మోడీ తనకు దేశ ప్రజలకోసం పనిచేస్తుండడం ఎంతో సంతోషాన్నిస్తోందని ట్వీట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/