Begin typing your search above and press return to search.
మోదీ బ్రదర్ సిల్లీ గోల చూశారా?
By: Tupaki Desk | 15 May 2019 4:03 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోదీ...సార్వత్రిక ఎన్నికల వేళ చాలా బిజీబిజీగానే ఉంటున్నారు. దేశం మొత్తానికి తన వాయిస్ ను వినిపించేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకున్నవాడికి మల్లే దేశాన్ని చుట్టేస్తున్నారు. మోదీ ఇలా బిజీగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోదీ మాత్రం ఓ సిల్లీ కారణాన్ని పట్టుకుని ఏకంగా నిరసనకారుడి అవతారం ఎత్తారు. అది కూడా ఓ పోలీస్ స్టేషన్ ముందు ఆయన ధర్నాకు దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అసలేం జరిగిందన్న విషయానికి వస్తే... జైపూర్ నుంచి అజ్మర్ వెళ్లడానికి సిద్ధమైన ప్రహ్లద్ మోడీ.. సెక్యూరిటీ సిబ్బంది విషయంలో కాస్తా బెట్టు చేశారు. ఆయనకు రక్షణగా వచ్చే ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది తన కారులో ఎక్కొద్దంటూ పట్టుబట్టారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఆయన వాహనంలో వారు కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ప్రహ్లద్ మోడీ అలా కుదరదంటూ.. వారు తన వాహనంలో ఎక్కేందుకు వీలు లేదంటూ నిరాకరించారు. తనకు కేటాయించిన సెక్యూరిటీ వాళ్లకు మరో వాహనం ఏర్పాటు చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ప్రహ్లద్ మోడీ తీరుతో అక్కడి పోలీసులు తలలు పట్టుకున్నారు. దాదాపు గంట రెండు గంటల పాటు ఆయన అలాగే నిరసన వ్యక్తం చేశారు.
చివరకు పోలీస్ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని ఆయనకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. నిబంధనలు విడమర్చి చెప్పడంతో చేసేదేమీ లేక ఆ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన వాహనంలోనే ఎక్కించుకుని బయలుదేరారు. అయినా ప్రధాని మోదీ సోదరుడి హోదాలో దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటిస్తూ సెక్యూరిటీ పేరిట ఆయా ప్రాంతాల లోకల్ పోలీసుల భద్రతను వినియోగించుకుంటున్న ప్రహ్లాద్... ఇలా తనకు సెక్యూరిటీ కల్పించడానికి వచ్చిన పోలీసులను తన కారులో ఎక్కడానికి వీల్లేదంటూ బీష్మించడం, తనకు సెక్యూరిటీగా వచ్చిన పోలీసులకు ఓ ప్రత్యేక వాహనం కేటాయించమనడం చూస్తుంటే సిల్లీ గోలగానే అనిపించక మానదు.