Begin typing your search above and press return to search.

తలచుకుంటే పది రోజుల్లో పాక్ ని భూస్థాపితం చేస్తాం !

By:  Tupaki Desk   |   29 Jan 2020 6:45 AM GMT
తలచుకుంటే పది రోజుల్లో పాక్ ని భూస్థాపితం చేస్తాం !
X
పాకిస్తాన్‌ను మట్టికరిపించడానికి భారత సైనిక దళాలకు వారం, పది రోజుల కన్నా ఎక్కువ సమయం పట్టదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మూడు యుద్ధాల్లో ఓడి పోయినా పాక్‌ తీరు మారలేదన్నారు. భారత్‌తో పరోక్ష యుద్ధాలకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రతీ ఏటా జరిగే ప్రధానమంత్రి నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌(ఎన్‌ సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మంగళవారం ప్రసంగించారు. పొరుగు దేశాల్లో మత పరమైన మైనారిటీలకు జరిగిన అన్యాయాలను సరిచేసే ప్రయత్నంలో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. వారికి గతంలో భారత్‌ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఈ చట్టం రూపొందించామని వివరించారు.

దేశం యావత్తూ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని ప్రధాని చెప్పుకొచ్చారు. 70 ఏళ్లుగా కశ్మీర్‌ సమస్య అపరిష్కృతంగా ఉంది. కొన్ని పార్టీలు, కుటుంబాలు ఈ సమస్య ను సజీవం గా ఉంచాయి. దీంతో ఉగ్రవాదం పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. పాక్‌ దుశ్చర్యలకు తెగబడేందుకు దోహదపడింది. ఈ చారిత్రక తప్పిదాన్ని మేం సరిచేశాం అని తెలిపారు. నెహ్రూ-లియాకత్‌ అలీ ఖాన్‌ ఒప్పందంలో ఉన్నదే ఇపుడు సీఏఏ రూపేణా మేం అమలు చేస్తున్నాం. పాక్‌, అఫ్గానిస్థాన్‌ల్లో బాధలు పడ్డ ముస్లిమేతరులు ఎప్పుడైనా భారత్‌కు రావచ్చన్నది నాడు ఆ ఒప్పందం లో ఉంది. ఇది నాటి ఒప్పంద స్ఫూర్తే కాదు... జాతిపిత గాంధీజీ ఆశయం కూడా అని తెలిపారు. బాధలు పడుతున్న మైనారిటీలకు ఆశ్రయం ఇవ్వాలని మేం సీఏఏ తెచ్చాం అని అన్నారు.