Begin typing your search above and press return to search.
దళారులు లేరట..మరి రాఫెల్ డీల్ మాటేంది మోడీజీ?
By: Tupaki Desk | 24 Aug 2018 6:40 AM GMTఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోడీ అడ్డంగా బుక్ అయిపోతున్న విషయాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తనను తాను నీతివంతుడిగా చెప్పుకోవటానికి మోడీ అస్సలు వెనుకాడరు. తమ ప్రభుత్వానికి అవినీతి మచ్చ అంటలేదని చెప్పే ఆయన.. తనకు నీడలా వెన్నంటి ఉండే అమిత్ షా కొడుకు ఆస్తులు అంత భారీగా ఎందుకు పెరిగాయన్న ప్రశ్నలకు ఒక్కసారి కూడా స్పందించరు.
అంతేనా.. తాను మాత్రమే కాదు.. తాను సర్టిఫై చేసినోళ్లంతా నీతివంతులేనన్న ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి మోడీ హయాంలో రాఫెల్ డీల్ మిగిల్చిన ప్రశ్నలు అన్ని ఇన్ని కావు. ఓపక్క రాఫెల్ వివాదంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే.. దాని మీద క్లారిటీ ఇవ్వని ప్రధాని.. తమ ప్రభుత్వం ఎంత నీతివంతమైనదన్న విషయాన్ని మా గొప్పగా చెప్పుకోవటం కనిపిస్తుంది.
కేంద్రం నుంచి విడుదలయ్యే ప్రతి పైసా పక్కాగా లబ్థిదారులకు చేరుస్తున్నామని.. దళారులకు.. కమీషన్ల వ్యవస్థకు తమ సర్కారులో ఎలాంటి స్థానం లేదని స్పస్టం చేశారు మోడీ. ఢిల్లీ నుంచి విడుదలయ్యే రూపాయి.. అందులో పెద్ద మొత్తం దళారులకు చేరేదని.. ఇది ఒకప్పటి మాట అని.. ఇప్పుడు రూపాయికి రూపాయి వంద పైసలు పక్కాగా లబ్థిదారులకు చేరుస్తామని చెప్పారు.
తన హయాంలో దళారి వ్యవస్థకు స్థానం లేదని స్పష్టం చేసిన మోడీ మాటలు ఇలా ఉంటే.. మరి దళారీలే లేకుంటే రాఫెన్ ఉదంతంలో రిలయన్స్ పాత్ర ఏమంటారు గురువుగారు? అన్న సందేహాలకు సమాధానాలు తీరని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. నీతిగా ఉన్నట్లుగా తమకు తాముగా ప్రచారం చేసుకునే కంటే.. ముందు అలాంటి వ్యవస్థను తయారు చేస్తే బాగుంటుంది.