Begin typing your search above and press return to search.
మోదీ డీల్...కశ్మీర్ కు చెక్ పెట్టినట్లేనా?
By: Tupaki Desk | 27 Aug 2019 4:43 AM GMTమన సరిహద్దు రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్ విషయంలో నెలకొన్న అంతర్జాతీయ జోక్యానికి ఫుల్ స్టాప్ పడే దిశగా పరిణామాలు మారుతున్నాయి. జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ - ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్ - పాకిస్థాన్ లో చర్యల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రంప్ ఇరుదేశాలకు సూచించారు. గతంలో కశ్మీర్ సమస్యకు పరిష్కారానికి మధ్యవర్తత్వం వహిస్తానన్న ట్రంప్ - మధ్యవర్తిత్వం ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదు. భారత్ - పాకిస్థాన్ అమెరికాకు మంచి మిత్ర దేశాలని అన్నారు. ఉగ్రవాదం, పేదరికంపై భారత్ - పాకిస్థాన్ లు పోరాటం చేయాల్సి ఉందన్నారు. కశ్మీర్ లో పరిస్థితులు కంట్రోల్ లో ఉన్నాయన్న మోదీ - సమస్య పరిష్కారానికి మూడవ దేశం జోక్యం అవసరంలేదని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో - అమెరికా సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఫ్రాన్స్ లో ట్రంప్ స్పందిస్తూ గత రాత్రి కశ్మీర్ అంశం గురించి చర్చించుకున్నట్లు తెలిపారు. కశ్మీర్ లో పరిస్థితి అదుపులోనే ఉందని మోదీ చెప్పినట్లు ట్రంప్ అన్నారు. పాకిస్థాన్ తోనూ మాట్లాడుతున్నాని - రెండు దేశాలు త్వరలోనే కశ్మీర్ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ట్రంప్ తెలిపారు. పాక్ - భారత్ మధ్య ఉన్న సమస్యలన్నీ ద్వైపాక్షికమే అని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే ఈ అంశంలో ఇతర దేశాల జోక్యం గురించి పెద్దగా పట్టించుకోమని మోదీ అన్నారు. 1947 కన్నా ముందు భారత్ - పాకిస్థాన్ దేశాలు కలిసే ఉన్నాయని ప్రధాని తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని ఇద్దరూ పరిష్కరించుకుంటామని మోదీ అన్నారు.
ఇదిలాఉండగా - ప్రధాని మోదీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచ సంక్షేమానికి భారత్-అమెరికా కలిసి పనిచేస్తాయని మోదీ చెప్పారు. వాణిజ్యం - రక్షణ సహకారంపై సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. భారత్-పాక్ ఎన్నో ద్వైపాక్షిక అంశాలపై పోరాటం చేయాల్సి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం - పేదరికం లాంటి ఎన్నో అంశాలపై భారత్-పాక్ యుద్ధం చేయాల్సి ఉందన్నారు. అమెరికాతో భారత్ కు బలమైన స్నేహబంధం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాలు ప్రపంచ శాంతి కోసం అరమరికలు లేకుండా ముందుకు సాగుతామని తెలిపారు. కశ్మీర్ లో పరిస్థితులు కంట్రోల్ లో ఉన్నాయన్న మోదీ - సమస్య పరిష్కారానికి మూడవ దేశం జోక్యం అవసరంలేదని వెల్లడించారు. అమెరికాలో భారత సంతతికి చెందిన పలువురు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శాంతి సహా అనేక విషయాలపై జీ7 సదస్సులో చర్చ జరిగిందని ఆయన తెలిపారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయ్యాక ఫోన్ చేసి అభినందించానని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తామిద్దరం పలు అంశాలపై చర్చించుకున్నట్లు చెప్పారు.
ట్రంప్ మాట్లాడుతూ కశ్మీర్ అంశంపైనా సదస్సులో చర్చ జరిగిందన్నారు. కశ్మీర్ లో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు మోదీ చెప్పారని ట్రంప్ వివరించారు. భారత్-పాక్ రెండూ అమెరికాకు మిత్ర దేశాలని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ విషయం భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని.. రెండు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఏడు శక్తివంతమైన దేశాల ముందే...భారత్ కు సంబంధించిన వాదనను బలంగా వినిపించారని - కశ్మీర్ సమస్యకు భారతదేశమే పరిష్కారం చూసుకోగలదని చెప్పడం భారత్ సత్తాను చాటుతోందని విశ్లేషకులు అంటున్నారు.