Begin typing your search above and press return to search.
బోటు ప్రమాదంపై మోడీ ఆరా..అసెంబ్లీలో బాబు
By: Tupaki Desk | 13 Nov 2017 10:37 AM GMTకృష్ణానదిలో బోటు ప్రమాదం వల్ల 20 మంది మరణించిన ఉదంతం అనేక మందిని కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ పమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్లో కృష్ణా నదిలో పడవ ప్రమాద ఘటన తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరి రోడ్డులో విషాదం నెలకొంది. నిన్న పడవ ప్రమాదంలో మృతి చెందిన కుమార్తె ను చూసి తల్లి మృతి చెందింది. కుమార్తె లీలావతి మృతి దేహం చూసి తల్లి లక్ష్మీ కాంతం గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.
ఇదిలాఉండగా...బోటు ప్రమాదంపై అసెంబ్లీలో చర్చజరిగింది. కృష్ణానదిలో నిన్న జరిగిన పడవ ప్రమాద సంఘటన అత్యంత దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పడవ ప్రమాద సంఘటనపై అసెంబ్లీలో ఆయన ఒక ప్రకటన చేశారు. పడవ ప్రమాదంలో 17 మంది ప్రథమ చికిత్స అనంతరం స్వస్థలాలకు తరలించామని ఆయన చెప్పారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 20 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను చంద్రబాబు ప్రకటించారు.
ప్రమాద సంఘటన తెలియగానే ఫెర్రీఘాట్ నుంచి కొందరు సంఘటన జరగగానే ప్రయాణీకులను రక్షించడానికి ముందుకు దూకారని చంద్రబాబు అన్నారు. వారు కొందరు ప్రయాణీకులను కాపాడగలిగారన్నారు. ఆ తరువాత ఎన్డీఆర్ ఎఫ్ సంఘటనా స్థలానికి చేరుకుందన్నారు. ప్రమాదంలో పడవను ఆపరేట్ చేసిన రివర్ బోట్ అండ్ అడ్వంచర్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కృష్ణానదిలో ప్రమాదానికి గురైన పడవలో కనీస భద్రతా ప్రమాణాలు లేవని చంద్రబాబు అన్నారు. రూట్ ట్రయల్ లేకుండా, అనుభవం లేని డ్రైవర్ పడవను నడిపాడని చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ పరంగా సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఈ సంఘటన వరకూ వస్తే ప్రమాదానికి జరిగిన పడవ ఆపరేటర్ విషయానికి వస్తే అతడు నిబంధనలను ఏ మాత్రం పాటించలేదన్నారు. బోటింగ్ ప్రక్రియను ప్రారంభించాలంటే తీసుకోవలసిన అనుమతులను ఆయన తీసుకోలేదన్నారు.
మరోవైపు కృష్ణానదిలో ఫెర్రీ సంఘటనతో అధికారులు అప్రమత్తమైయ్యారు. కృష్ణా,గుంటూరు జిల్లాల మద్య కృష్ణానదిపై ఏళ్ల తరబడి రాకపోకలు సాగిస్తున్న బల్లకట్టులపై దృష్టి సారించారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా - గుంటూరు జిల్లాల మద్య తిరిగే బల్లకట్టును నిలిపివేశారు. బల్లకట్టు యాజమాన్యం సరైన పత్రాలు చూపకపోవడంతో పాటు లైఫ్ జాకెట్స్ కూడా సరిగా లేకపోవడంతో బల్లకట్టును నిలిపివేసినట్లు గా అధికారులు తెలిపారు.