Begin typing your search above and press return to search.

ఒకే దేశం..ఒక భాష..ట్వీట్ మాత్రం తెలుగులో ఎందుకు?

By:  Tupaki Desk   |   16 Sep 2019 6:09 AM GMT
ఒకే దేశం..ఒక భాష..ట్వీట్ మాత్రం తెలుగులో ఎందుకు?
X
భిన్న ప్రాంతాలు.. ప్రజలు.. కల్చర్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అవన్నీ కలగలిపితే భారత్ అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం మన విలక్షణతగా గొప్పలు చెప్పుకుంటాం. మోడీషాల పుణ్యమా అని.. ఒకే దేశం.. ఒకే ఫలానా అంటూ పలు దరిద్రాల్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. అందులో కొన్ని మంచివి కూడా ఉన్నాయి. అలా అని అన్ని అలానే ఉండాలనుకోవటం తప్పు. ఎవరి భావోద్వేగాలు వారివి. ఆ విషయాన్ని మోడీషాలు మర్చిపోకూడదు.

అన్నింటికి మించిన భారత ఆత్మ గురించి అవగాహన చేసుకునే బదులు.. తమకు తామే కొత్త అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా తాజాగా ఒకే దేశం.. ఒకే భాష.. అంటూ దరిద్రపుగొట్టు నినాదాన్ని తెర మీదకు తెచ్చారు అమిత్ షా. మరి.. అదే నిజమైతే.. తాజాగా జరిగిన గోదారి దుర్ఘటన సందర్భంగా బాధితులకు ఊరడింపు మాటలకు హిందీలో చెప్పకుండా.. తెలుగులో ట్విట్టర్ లో మోడీ సాబ్ పోస్ట్ చేయటం ఎందుకు? ఒకే దేశం.. ఒకే భాష అన్నసొల్లు డైలాగులు చెబుతూ.. తమ పైత్యాన్ని దేశ ప్రజల మీద రుద్దే నేతలు.. తమ వరకూ వచ్చేసరికి మారిపోతుంటారెందుకో? తమ మైలేజీ పెంచే విషయాలకు వచ్చినప్పుడు మాత్రం.. ఆయా ప్రాంతాలకు చెందిన భాషల్లో ట్వీట్లు చేయటం ఎందుకు? ఒకే దేశం.. ఒకే భాష అన్న మాటను మోడీ చేత ఆచరించిన తర్వాత.. దేశ ప్రజలకు చెబితే బాగుంటుంది కదా అమిత్ షా?