Begin typing your search above and press return to search.

సురేష్ ప్ర‌భుకు ఆ శాఖ ఇవ్వ‌డం వెనుక మోడీ లెక్క‌లు వేరే

By:  Tupaki Desk   |   10 March 2018 12:09 PM GMT
సురేష్ ప్ర‌భుకు ఆ శాఖ ఇవ్వ‌డం వెనుక మోడీ లెక్క‌లు వేరే
X
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో.. నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ ఎంపీలు అశోక గజపతిరాజు - సుజనా చౌదరి తమ కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. కేంద్ర వాణిజ్య - పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అదనంగా పౌర విమానయాన శాఖ బాధ్యతలను అప్పగించారు. ప్రధాని కార్యాలయం సూచన మేరకు సురేశ్ ప్రభుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలను అప్పగించినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అయితే సురేశ్ ప్ర‌భుకే ఈ ప‌ద‌వి ఇవ్వ‌డం వెనుక ప్ర‌ధాని మోడీ లెక్కలు వేరే అంటున్నారు.

వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్న సురేష్ ప్రభుకు... అశోక్ గజపతిరాజు రాజీనామాతో ఖాళీ అయిన పౌరవిమానయాన శాఖను కేటాయించారు. 2014లో శివసేనను వదిలి బీజేపీలో చేరారు సురేష్ ప్రభు. సురేష్ ప్ర‌భు ప్ర‌స్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుంచి 17 వరకు రైల్వే మంత్రిగా పనిచేశారు. వరుస ప్రమాదాలు జరగడంతో ఆయనను గతంలో రైల్వే మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అశోక్‌ గ‌జ‌ప‌తిరాజు ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న్ను భ‌ర్తీ చేసేందుకు అదే రాష్ర్టానికి చెందిన వ్య‌క్తికి చాన్స్ ఇచ్చార‌ని వివ‌రిస్తున్నారు. పైగా టీడీపీ సైతం సంయ‌మ‌నంతో ఉండేందుకే ఈ నిర్ణ‌య‌మ‌ని పేర్కొంటున్నారు.