Begin typing your search above and press return to search.

పాపం ... మోడీకి మతిస్థిమితం లేదట

By:  Tupaki Desk   |   7 May 2019 9:20 AM GMT
పాపం ... మోడీకి మతిస్థిమితం లేదట
X
ఒక్కో దశ ఎన్నికలు ముగిసే సరికి నరేంద్రమోడీపై ఒత్తిడి - ఫలితాలపై అనుమానం పెరిగిపోతోంది. సాధారణంగా జాగ్రత్తగా వ్యాఖ్యానించే మోడీ మాజీ ప్రధానిపై దారుణమైన కామెంట్లు చేశారు. రాజీవ్ గాంధీ చనిపోయాక ఇంతకాలానికి నెం.1 కరప్ట్ అంటూ కామెంట్లు చేయడంపై చాలా విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనిని సీరియస్ గా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ మోడీపై ఆగ్రహంగా ఉంది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం మాత్రమే కాదు. ఎక్కడికక్క నిరసన తెలియజేస్తోంది. మోడీ హుందా తనం కోల్పోయాడు అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. సామాన్యులు కూడా దీన్ని వ్యతిరేకించారు.

అయితే, చత్తీస్‌ ఘడ్ సీఎం భూపేశ్ బాఘెల్ మోడీ వ్యాఖ్యలను తప్పుపడుతూ మోడీని టార్గెట్ చేశారు. మోడీకి మతి స్థిమితం లేదంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. దేశాన్ని ఎన్నో అడుగులు ముందుకు తీసుకెళ్లిన రాజీవ్‌ గాంధీని అవినీతిపరుడిగా ఇపుడు పేర్కొనడం మోడీ దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం అన్నారు. మోడీకి మతిస్థిమితం తప్పారనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా పేర్కొన్నారు. ఆయనకు మెడికల్ ట్రీట్‌ మెంట్ అవసరం అని అభిప్రాయపడ్డారు. మోడీకి ఎందుకు మతి తప్పిందో కూడా బాఘెల్ వివరించారు. రోజుకు మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని మొన్న అక్షయ్ తో ఇంటర్వ్యూలో మోడీ చెప్పాడు. మనిషికి కనీసం 7 గంటలు నిద్రలేకపోతే మెదడు సరిగా పనిచేయడం మానేస్తుంది. బహుశా ఈ కారణం వల్ల మోడీకి మతి తప్పి ఉంటుందని బాఘెల్ అన్నారు. మనిషి బుర్ర పనిచేయాలంటే కనీసం 7 గంటలు నిద్రపోవాలని అన్నారు.