Begin typing your search above and press return to search.
ఒకే వేదికపై మోదీ - ఇమ్రాన్... నో గ్రీటింగ్ నో మీటింగ్
By: Tupaki Desk | 4 Jun 2019 8:38 AM GMTభారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ - పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చే వారం కిర్గిస్తాన్ రాజధాని బిష్ కెక్ లో ఒకే వేదిక పంచుకోనున్నారు. షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీకి హాజరువుతున్న ఇరు దేశాల ప్రధానులు వ్యక్తిగతంగా భేటీ అవుతారా లేదా అన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య సమావేశం ఉన్నట్లు ఇంతవరకు ఇరు దేశాలు ధృవీకరించలేదు. అయితే ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలకరించుకోవచ్చని మాత్రం భావిస్తున్నారు.
పుల్వమాదాడి తరువాత జరిగిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ - లష్కరే తోయిబా అధినేత అజహర్ మసూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ప్రకటించడంలో భారత్ సాధించిన విజయం నేపథ్యంలో.. భారత్ - పాక్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు భారత్ వైఖరి - ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మోడీ ప్రభుత్వం తీరులో మార్పు ఉంటుందని ఇస్లామాబాద్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారత్ నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఇమ్రాన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోడీని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ ద్వారా అభినందనుల తెలిపారు. ఇకపై ద్వైపాక్సిక సంబంధాలను మెరుగు పర్చుకుందామని ప్రతిపాదించారు.
భారత్‌లో ఎన్నికల సమయంలో ఇమ్రాన్ బీజేపీ నివ్వెరపోయే ప్రకటన చేశారు. మరోసారి నరేంద్రమోడీనే ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. భారత్-పాక్ సంబంధాలు మెరుగవుతాయని ఆశించారు. అయితే నరేంద్రమోడీ తన ప్రమాణస్వీకార సందర్భంలో పాకిస్తాన్‌ను తీవ్ర నిరాశకు గురి చేశారు. కేవలం బిమ్ స్టెక్ సభ్య దేశాలను మాత్రమే పిలవడం - అందులో పాకిస్థాన్ సభ్య దేశం కాకపోవడంతో ఇమ్రాన్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాలేకపోయారు.
మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నరేంద్రమోడీ సార్క్ దేశాధినేతలను పిలవడంతో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. కానీ ఈసారి ఉద్దేశ్యపూర్వంగానే - పాకిస్థాన్ ను దూరం పెట్టాలనే సార్క్ దేశాలను కాకుండా బిమ్ స్టెక్ దేశాలను ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు మోదీ ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ - పాక్ దేశాల మధ్య చర్చల్లో మరికొంత కాలం ప్రతిష్టంభన కొనసాగుతుందనే అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రక్రియలో ప్రధాని మోదీ ప్రధానంగా తన ప్రసంగాల్లో పాక్ ఉగ్రవాదాన్ని - పుల్వామా దాడినే ప్రస్తావించారు. పాకిస్థాన్ వంటి శత్రు దేశాల నుంచి బీజేపీ ఒక్కటే భారత్‌ని రక్షిస్తుందని దేశ ఓటర్లకు నమ్మకం కలిగించారు. దీంతోనే బీజేపీ ఘన విజయం సాధించిందనే వాదనా కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఎన్నికలు అయిపోయిన వెంటనే పాకిస్థాన్ తో చేతులు కలపడం - ఇమ్రాన్ తో చర్చలు భావ్యం కాదనే అభిప్రాయం ఉంది. విదేశీగడ్డపై కూడా దాయాది దేశాధిపతితో సామరస్యంగా వ్యవహరించడం మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుతం భారత దేశం ఉగ్రవాదంతో చర్చలు పొసగవనే వైఖరి అవలింభిస్తోందని - మోడీ - ఇమ్రాన్ మధ్య సాధారణ పలకరింపులు కూడా ఉండక పోవచ్చని అంటున్నారు. ఇదే కాకుండా పాకిస్థాన్‌లో ఇండియ హైకమిషన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆహ్వానితులను అవమానించడం కూడా రెండు దేశాల మధ్య సంబంధాలను మరోసారి దెబ్బతీసిందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కిర్గిస్తాన్ లో మోదీ - ఇమ్రాన్ మధ్య ఎలాంటి భేటీ ఉండదనే పరిశీలకులు అంటున్నారు.