Begin typing your search above and press return to search.
వీ ప్రౌడ్ ఆఫ్ యూ...దేశం మీ వెనుకే ఉంది : లెహ్ లో మోడీ !
By: Tupaki Desk | 3 July 2020 10:30 AM GMTభారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ లో ఆకస్మికంగా పర్యటించారు. సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి లేహ్ కు చేరుకున్నారు. జూన్ 15న గల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్ కు చెందిన 20 మందిసైనికులు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయపడ్డ సైనికులను సైతం మోదీ పరామర్శించారు. సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని పర్యటించినట్లు తెలుస్తోంది.
ఈ పర్యటన సందర్భంగా లెహ్‌లో సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు...సైన్యం పై ప్రసంశలు కురిపించారు. సైనికుల ధైర్య సాహలు పర్వతాల తరహాల ధృడమైనవని, గడ్డ కట్టే చలిలో దేశం కోసం చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నానరు. మీ ధైర్య సాహసాలు అజరామరం అని, చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని కీర్తించారు. గాల్వాన్ వ్యాలీ ఘటనతో ప్రపంచానికి ఒక బలమైన సంకేతాలు పంపించారని గుర్తుచేశారు.
అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. జవాన్లను చూసి దేశంలోని ప్రతీ పౌరుడు గర్వపడుత్నారని తెలిపారు. లడాఖ్ నుంచి కార్గిల్ వరకు సైనికులు చూపిన తెగువ, ధైర్య సాహనాలను యావత్ జాతి చూసిందన్నారు. . దేశంలోకి శత్రువులను చొరబడ నీయకుండా చేసేందుకు ప్రాణ త్యాగం చేసిన వీరులకు వందనం తెలిపారు. భారతదేశంపై కుట్రలు పన్నుతున్న శత్రుదేశాలు ఆటలు సాగబోమని హెచ్చరించారు.
ఇన్ని రోజులు మీ ధైర్యం గురించి విన్నామని.. ఇప్పుడు చూస్తున్నామని , దేశ రక్షణ మీ చేతుల్లో భద్రంగా ఉందన్నారు. దేశం కోసం అహోరాత్రులు కష్టపడుతున్న మీ తీరు ఆత్మ నిర్భర భారత్ ఇనుమడింప చేస్తోందని తెలిపారు. సైనికుల ధైర్యం, తెగువ వెలకట్టలేదని, వారి పోరాటం భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఇప్పుడే కాదు గతంలో కూడా శత్రువులతో పోరాడామని ప్రధాని మోడీ గుర్తుచేశారు. శత్రువుల కుట్రలను పటాపంచలు చేశామని తెలిపారు. ధైర్య సాహసాలు ఉన్నవారే శాంతిని కోరుకుంటారని పేర్కొన్నారు.
కానీ దానిని తక్కువ అంచనా వేయొద్దని.. ఈ విషయం ఇప్పటికే ఇతర దేశాలకు అర్థమై ఉంటుందని తెలిపారు. ప్రధాని మోడీ ప్రసంగిస్తోన్న సమయంలో వందేమాతరం నినాదంతో ప్రాంగణం మొత్తం మారుమోగిపోయింది. చైనా ప్రపంచశాంతికి పెను ప్రమాదంగా మారిందని , ఇప్పటివరకు కుయుక్తులు పన్నేవారి ప్రయత్నాలు ఎక్కడా ఫలించలేదవన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మించి చూపిస్తామని స్పష్టంచేశారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని ప్రధాని మోడీ నినాదించారు.