Begin typing your search above and press return to search.
మోడీ గేమ్-ఆ క్రెడిట్ కోసమే ఓపెనింగ్స్ వాయిదా!
By: Tupaki Desk | 28 May 2018 8:20 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విపక్షాలు తాజాగా కొత్త ఆరోపణలను చేస్తున్నాయి. ఒక్క ఉప ఎన్నికలో గెలిచేందుకు రూ. 11,000 కోట్లు ఖర్చుచేసి నిర్మించిన రోడ్డును తన ప్రచారానికి వేదికగా మార్చుకున్నారని దుయ్యబడుతున్నాయి. ఆదివారం ప్రధాని ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే మొదటిదశ నిర్మాణాన్ని - ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించారు. 135 కి.మీ.ల ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే(ఈపీఈ)ని రూ.11వేల కోట్లతో 500 రోజుల్లో నిర్మించగా - ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే (డీఎంఈ) తొమ్మిది కి.మీ.ల తొలిదశ నిర్మాణాన్ని 18నెలల్లో పూర్తిచేశారు.నాలుగు లోక్ సభ స్థానాలకు - 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం వివిధ రాష్ర్టాల్లో జరుగనున్న ఉపఎన్నికలకు ఒక్కరోజు ముందు ప్రధాని ఈపీఈని జాతికి అంకితం చేయడం గమనార్హం.
అయితే, దీనికి ముందుగా అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత నెల 29న ఈ రోడ్డును ప్రారంభించాలని అనుకున్నా.. ఆ సమయానికి మోడీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో 'బిజీ'గా ఉండటంతో దీని ప్రారంభాన్ని అధికారులు వాయిదా వేశారు. దీనిపై దాఖలైన వ్యాజ్యానికి కోర్టు పై విధంగా స్పందిస్తూ భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ ఏఐ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ``ప్రజల ప్రయోజనార్థం నిర్మించిన రహదారులను నేతలు ప్రారంభించే వరకు అందుబాటులోకి తీసుకురాలేరా?``అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేను మోడీ ఆదివారం ప్రారంభించారు. కాగా, ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ నియోజక వర్గంతో సహా పలు రాష్రాల్లో సోమవారం ఉప ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పరోక్షంగా ఆ ఎన్నికలకు ప్రచారం చేసుకోవడం కోసమే దీనిని ఉపయోగించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
14 లేన్ల రహదారి.. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే ప్రత్యేకతలు ఇవే
-దాదాపు 50వేల వాహనాలను ఈ హైవేకి మళ్లించడం వల్ల ఢిల్లీ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా దేశ రాజధానిలో కాలుష్యం తగ్గడంతోపాటు.. ఘజియాబాద్ - గ్రేటర్ నోయిడా - ఫరీదాబాద్ - ఫల్వాల్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించవచ్చు.
-అశోక చక్ర - కోణార్క్ దేవాలయం - గేట్ వే ఆఫ్ ఇండియా - చార్మినార్ తదితర ప్రఖ్యాత కట్టడాల ప్రతిరూపాలను ఈ హైవే వెంట ఏర్పాటు చేశారు.
- ఢిల్లీ-మీరట్ మధ్య 96 కి.మీ.ల పొడవునా ఈ ఎక్స్ ప్రెస్ వేను రూ.841 కోట్లతో నిర్మించనున్నారు. యమునానది తీరం వెంబడి బిందుసేద్యంతో పెంచే నిట్టనిలువు ఉద్యానవనాలతో అలరారనున్న ఈ రహదారి.. దేశంలోనే నిర్మించిన తొలి ఆకర్షణీయ పర్యావరణ మార్గంగా నిలువనున్నది.
-రహదారి పరిసరాల్లో కాలుష్యం పెరిగితే వెంటనే అప్రమత్తం చేసేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక అలారమింగ్ విధానం దీని సొంతం.
-వర్షపునీరు నిలిచిపోకుండా పొలాల్లోకి మళ్లేలా ఎక్కడికక్కడ ప్రత్యేక పైప్ లైన్లను నిర్మించారు.
-14లేన్ల ఈ రహదారిలో ఆరువరుసల ఎక్స్ ప్రెస్ వేకు సమాంతరంగా అటు ఇటు నాలుగేసి వరుసల హైవే ఉంటుంది. ఇరువైపులా 1.5మీటర్ల ఫుట్ పాత్ కూడా ఉంటుంది.
-ఈ రహదారిపై 11 వంతెనలు - ఐదు పెద్ద - 24 చిన్న వంతెనలు - 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు - 36 వాహన - 14 పాదచారుల భూగర్భ మార్గాలు ఉన్నాయి.
-కేవలం 18నెలల్లోనే ఈ రహదారి తొలిదశ నిర్మాణం (9 కి.మీ.) పూర్తయ్యింది. ఢిల్లీ-నోయిడా ప్రయాణికులకు ఇది ఉపయోగపడనున్నది.
-ఢిల్లీ నుంచి మీరట్ కు ప్రస్తుతం 4 నుంచి 5 గంటల సమయం పడుతుండగా - డీఎంఈ పూర్తయితే 45నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
-ఈ ఎక్స్ ప్రెస్ వేపై 23కిలోమీటర్ల దూరం సైకిళ్లపైనా ప్రయాణించే వెసులుబాటు ఉంది. వారికోసం రహదారికి ఇరువైపులా 2.5 మీటర్ల ప్రత్యేక ట్రాక్ నిర్మించారు.