Begin typing your search above and press return to search.
మోదీ గ్రాఫ్ పెరిగింది..వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ ఆయనే!
By: Tupaki Desk | 21 Jun 2019 1:50 PM GMTభారత ప్రధానిగా వరుసగా రెండో పర్యాయం కూడా క్లిస్టర్ క్లియర్ మెజారిటీతో పదవీ బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఆయన ఎంపికయ్యారు. అంతేకాదండోయ్... అగ్రరాజ్యంగా కీర్తింపబడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లను వెనక్కు నెట్టేసి ఈ జాబితాలో అగ్ర స్థానంలో కూర్చున్నారు. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత మేగజీన్ హెరాల్డ్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో మోదీని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ప్రపంచ దేశాలకు చెందిన ప్రజలు ఎన్నుకున్నారు.
ఈ జాబితాలో మోదీ టాప్ ప్లేస్ లో నిలిస్తే.... ట్రంప్ ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అనూహ్యంగా రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ప్రపంచంలో అగ్ర రాజ్యంగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోక తప్పలేదు. హెరాల్డ్ పత్రిక ఈ సర్వేను సాదాసీదాగా నిర్వహించలేదట. తొలుత ప్రపంచంలో శక్తివంతమైన నేతలుగా ప్రచారంలో ఉన్న వారిలో టాప్ ప్లేస్ లో ఉన్న ఓ 25 మంది నేతలను ఎంపిక చేసి ప్రాథమిక పోలింగ్ తర్వాత వారిలో 21 మందిని జాబితా నుంచి తొలగించేసి... మోదీ - ట్రంప్ - పుతిన్ - జిన్ పింగ్ లతో కూడిన జాబితాను ఫైనల్ లిస్ట్ లో పెట్టేసి పోలింగ్ నిర్వహించిందట.
ఈ పోలింగ్ లో పాలుపంచుకునే వారు ఏదో అలా ఒక క్లిక్కేసి వెళ్లిపోవడం కాకుండా... వారి మొబైళ్లకు ఓటీపీ పంపి - దానిని నిర్ధారణ చేసుకున్నాకే వారి ఓట్లను స్వీకరించిందట. అంటే ఆన్ లైన్ లో అయినా ఈ పోలింగ్ చాలా పక్కాగానే జరిగిందన్న మాట. ఇంత పక్కాగా జరిగిన పోలింగ్ లో ప్రపంచ దేశాలకు చెందిన నెటిజన్లు మోదీకి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా పట్టం కట్టరన్న మాట. ఇక పోలింగ్ లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న విషయానికి వస్తే... టాప్ ప్లేస్ లో ఉన్న మోదీకి 30.9 శాతం మంది ఓటేశారు. రెండో స్థానం దక్కించుకున్న పుతిన్ కు 29.9 శాతం ఓట్లు దక్కాయి.
ఇక మూడో ప్లేస్ లో ఉన్న ట్రంప్ కు కేవలం 21.9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జిన్ పింగ్ కు 18.1 శాతం మంది ఓటేశారట. ఈ లెక్కన ట్రంప్ కంటే మోదీ భారీ మెజారిటీ సాధించినట్టే లెక్క. మోదీకి - ట్రంప్ కు 9 శాతం మేర ఓట్ల తేడా నమోదైంది. జాబితాలో తన కంటే వెనుక స్థానాల్లో నిలిచిన ముగ్గురు దేశాధినేతలతో మోదీ భేటీలు - విదేశీ పర్యటనలు - ఆ పర్యటనల్లో సాధించిన ఫలితాలను బేరీజు వేసిన నెటిజన్లు మోదీని వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఎన్నుకున్నారని హెరాల్డ్ ప్రకటించింది. జూలై సంచిక మోదీ కవర్ పేజీతో విడుదల అవుతుందని హెరాల్డ్ ప్రకటించింది.